కేసీఆర్ డౌన్‌ఫాల్‌కు ఎవరో కారణం కాదు.. ఆయనే..??

Suma Kallamadi

• పదేళ్లు అధికారంలో ఉన్న ఘన చరిత్ర  
• ఆ సమయంలో చేసిన తప్పులే పార్టీ పునాదులు కదిలించేసాయి  
• వెరసి ఒక్క సీటూ గెలుచుకోలేని దుస్థితిలో కేసీఆర్
( తెలంగాణ - ఇండియా హెరాల్డ్)
కేసీఆర్ తెలంగాణ ఏర్పాటు అయ్యాక 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. ఈ పదేళ్లలో చాలా వ్యతిరేకత మూట గట్టుకున్నారు. అందుకే ఆయన దారుణంగా ఓడిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా తెరవకుండా  ఘోర పరాజయం పాలయ్యారు. తెలంగాణ తీసుకొచ్చి, పదేళ్లపాటు అధికారంలో ఉండి, ఇప్పుడు ఇలా సున్నాకే పరిమిత కావడం చాలా అవమానకరం చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి స్వయంకృతాపరాధమే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తెలంగాణ ఉద్యమంలో తనతో పాటు తిరిగి, కేసుల్లో ఇరుక్కున్న వారికి కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వలేదు. వారిని కాదని వేరే వారికి పదవులు ఇచ్చారు. పార్టీలో మొదటినుంచి ఇలాంటి సమస్యలు ఉన్నాయి. వాటిని అధిష్టానం గుర్తించలేదు, కింది స్థాయి నాయకుల అవినీతిని అరికట్టలేదు. కబ్జాలకు తెగబడుతుంటే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించింది బీఆర్ఎస్ అధిష్టానం. ఎమ్మెల్యేలు, మంత్రుల సమస్యలను కూడా వినలేదు. కేసీఆర్ ఎవరితోనూ కలవలేదు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు కూడా కేసీఆర్ ఓటమిని శాసించాయి.
హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ ఎంతో ప్రయత్నించారు కానీ ప్రజలు అతని ఆశలపై నీళ్లు చల్లారు. గులాబీ పార్టీ రోజురోజుకూ మరింత బలహీనంగా తయారవుతుంది. ఎన్నికలకు వన్ ఇయర్ కూడా టైమ్ లేని సమయంలో జాతీయ రాజకీయాలపై పోటీ చేయడానికి కేసీఆర్ పూనుకున్నారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చి తప్పు చేశారు. ఎందుకంటే టీఆర్ఎస్ పేరు ఆ పార్టీకి మంచి సెంటిమెంట్‌. ఆ సెంటిమెంట్‌ కారణంగా వాళ్లు రెండు పర్యాయాలు వరుసగా గెలిచారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా అవినీతి అక్రమాలు జరిగినట్టు ప్రజలు గుర్తించారు. మేడిగడ్డ ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు బయటపడ్డాయి. ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోయడం, కేసీఆర్ అసమర్థంగా ఉండటం పార్టీకి పెద్ద మైనస్ అయ్యింది. నిరుద్యోగులకు జాబులు వేయకపోవడం, నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేయడం, చదువు విషయంలో స్కామ్స్‌, పేపర్ లీక్స్ వంటివి వాటివల్ల యువత పూర్తిగా వ్యతిరేకమయ్యారు. డబుల్ బెడ్‌రూం అంటూ డప్పు కొట్టుకోవడం తప్ప చాలా జిల్లాల్లో ఎవరికీ ఇల్లు ఇవ్వలేదు. ఇక కేసీఆర్ చాలా గర్వంగా, అహం చూపిస్తూ మాట్లాడుతుంటారు. అది కూడా ప్రజలకు నచ్చలేదు. దళిత బంధు అని కొంతమందికే డబ్బులు ఇచ్చారు. రైతుబంధు అని భూస్వాములకు ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టారు. కేసీఆర్ ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్రం నాశనం  అవుతుందని ప్రజలు భయపడ్డారు. అందుకే అతనిని దించేశారు. మొత్తం మీద కేసీఆర్ ఓటమికి కేసిఆర్ ఏ కారణమయ్యారని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: