జగన్‌ కు షాక్...ఎదురుతిరుగుతున్న అవినాశ్‌ రెడ్డి?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... వైసిపి పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి... టిడిపిని ఎదుర్కొనేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యువచనలో ఉన్నట్లు జగన్మోహన్ రెడ్డి పై చాలా వార్తలు వస్తున్నాయి.

పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్లమెంటు బరిలో నిల్చోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారట.  కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డిని... రాజీనామా చేయమని... తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేయబోతున్నారట. ఈ తరుణంలో కడప అలాగే పులివెందుల నియోజకవర్గాలలో బై ఎలక్షన్స్ వస్తాయి. పులివెందుల నియోజకవర్గం నుంచి వైయస్ విజయమ్మ ను బరిలో దింపేందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్లాన్ వేశారట.
ఒకవేళ వైయస్ విజయమ్మ కాదంటే... వయసు భారతిని బరిలోకి దింపేందుకు ఇప్పటికే... ప్లాన్ బి కూడా రెడీ చేసుకున్నారట జగన్మోహన్ రెడ్డి. అటు... కడప ఎంపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి బరిలో నిల్చోని... పార్లమెంటుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట. అయితే జగన్మోహన్ రెడ్డి స్కెచ్ బాగానే ఉంది కానీ... ఆయన ప్లాన్ కు అవినాష్ రెడ్డి విలన్ గా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు తాను రాజీనామా చేస్తే..  తెలుగుదేశం కూటమి తనను మరింత ఇబ్బందులు పెడుతుందని అవినాష్ రెడ్డి అంటున్నారట.
 

ఇప్పటికే చాలామంది వైసిపి నేతలను టార్గెట్ చేసిన టిడిపి చాలా కేసులు పెట్టింది. కొంతమందిని జైలుకు కూడా పంపించే ప్రయత్నంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఇలాంటి నేపథ్యంలో తాను అసలు రాజీనామా చేయబోనని..  జగన్ ముందు తన అభిప్రాయం అవినాష్ రెడ్డి పెట్టారట. అయితే అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు.. తాను చూసుకుంటానని జగన్ కూడా హామీ ఇచ్చారట. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఇది ఇలా ఉండగా...  చంద్రబాబు తరహాలోనే అసెంబ్లీకి రాకుండా మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టాలని జగన్ అనుకుంటున్నారట. అందుకే ఈ వ్యవహారానికి తెరలేపినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: