ప‌వ‌న్ - బాబుకు ఫుల్‌... జ‌గ‌న్‌కు నిల్‌... ఈ షాకింగ్ లెక్క ఇదే..?

RAMAKRISHNA S.S.
( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ )
అదేంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఖుషి గా ఉంటే జగన్ నిల్ ఏంటి..? ఈ షాకింగ్ లెక్క ఏంటి..? అనుకుంటున్నారా ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, తెలుగుదేశం పార్టీ బీజేపీ మూడు కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశాయి. నిజం చెప్పాలి అంటే 3 పార్టీలకు చెందిన నేతల్లో చాలామంది సీట్లు వదులుకొని త్యాగాలు చేశారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి వీరు త్యాగాలకు ఫలితం ఉండబోతుంది. 2026 లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది.

అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మరో 50 సీట్లు అదనంగా రానున్నాయి. ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల స్థానంలో మొత్తం 225 స్థానాలు ఏర్పడబోతున్నాయి. అప్పుడు చాలామంది కొత్త నేతలకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రానుంది. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీలో త్యాగాలు చేసిన వారిలో చాలామందికి అప్పుడు సీట్లు రానున్నాయి. ఇక కొత్త తరంలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ప్రతి పార్టీలోనూ చాలామంది కొత్త తరం నేతలు.. కొత్తవారు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది.

పైగా అధికార పార్టీ కావడంతో టీడీపీ, జనసేన, బిజీపీ నుంచి పోటీ చేసేందుకు ఎక్కువమంది బలమైన అభ్యర్థులు దొరుకుతారు. అదే టైంలో పార్టీ ఘోరంగా ఓడిపోయి కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ నుంచి ఏకంగా 225 అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులు పోటీ చేయటం అంటే పెద్ద షాకే అని చెప్పాలి. జగన్‌కు ఈ ఐదేళ్లు పార్టీని నడపటం కత్తి మీద సాము .. అలాంటిది 225 స్థానాలలో ఎమ్మెల్యే అభ్యర్థులను వెతుక్కోవటం అంటే చాలా కష్టం. నిజం చెప్పాలంటే అప్పటివరకు పార్టీని నడపడమే జగన్ ముందు ఉన్న పెద్ద సవాల్‌. మరి ఆ టైం కు 225 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఎక్కడి నుంచి పట్టుకొస్తారో..? చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: