వంశీ, కొడాలి నాని రాజ‌కీయాల‌కు గుడ్ బైనా.. వైసీపీకి బైబైనా..?

RAMAKRISHNA S.S.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గుడివాడ మాజీ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇద్దరు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను టార్గెట్ గా చేసుకుని ఎలా ? రెచ్చిపోయారో చూసాం. ప్రతిసారి కూడా నాని, వంశీ ఇద్దరు చంద్రబాబు , లోకేష్‌కు దమ్ముంటే మంగళగిరి కుప్పం వదిలేసి.. గుడివాడ, గన్నవరం వచ్చి మాపై పోటీ చేసి గెలవాలని సవాళ్లు రూవ్వారు. అయితే ఈ ఎన్నికల్లో వంశీ నాని ఇద్దరు చిత్తుచిత్తుగా ఓడిపోయారు.

తమ తమ నియోజకవర్గాలలో వారికి కనీసం పట్టు కూడా లేదని ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. అయితే ఎన్నికలకు ముందు నాని, వంశీ ఇద్దరి కూడా సింపతి గేమ్ ప్లాన్ చేశారు. వంశీ అయితే తనకు ఇవే చివరి ఎన్నికలు అని.. వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయను అని.. ఈ ఒక్కసారికి తను పోటీ చేస్తున్నాను.. గన్నవరం అభివృద్ధి చేస్తాను. ఈ ఒక్కసారికి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.. వచ్చే ఎన్నికలలో వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు కుమార్తె ఉంగుటూరు జడ్పిటిసి పోటీ చేస్తారని ప్రకటించారు.

అలా వంశీ సింపతి వర్కౌట్ కాలేదు. కొడాలి నాని కూడా ఇవే తనకు చివరి ఎన్నికలు అన్నట్టు అక్కడక్కడా గేమ్ ప్లే చేశారు. అయితే నానిని గుడివాడ ప్రజలు ఏకంగా 53,000 ఓట్ల భారీ తేడాతో చిత్తుచిత్తుగా ఓడించారు. మరి వీరిద్దరూ తమకు ఇవే చివరి ఎన్నికలు అన్న మాటకు కట్టుబడి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటారా..? రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తారా..? లేదా రాజకీయాల్లో కంటిన్యూ అవుతూ వైసిపికి బై బై చెప్పేస్తారా..? వీరు మాటమీద నిలబడతారా అన్న చర్చలు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయ వర్గాల్లో ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి. మ‌రి వీరు ఏం చేస్తారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: