రెడ్ బుక్‌ సంచ‌ల‌నం - లిస్టులో ఉన్న వైసీపీ నేత‌లు వీళ్లే... ట్రీట్మెంట్ మామూలుగా ఉండ‌దా ?

RAMAKRISHNA S.S.
- లోకేష్ రెడ్‌బుక్‌లో మాజీ సీఎం జ‌గ‌న్ నుంచి పెద్దిరెడ్డి, రోజా, నాని, వంశీలు కూడా
- మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు... పోలీసు ఉన్న‌తాధికారులూ
- టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను హెరాస్ చేసిన అధికారులు కూడా టార్గెట్‌
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
రెడ్ బుక్‌- ప్ర‌స్తుతం ఈ మాట వైసీపీ నాయ‌కుల నోటి నుంచి ప‌దే ప‌దే  వ‌స్తోంది. ఈ రెడ్ బుక్‌లో ఉన్న పేర్ల వారీగా.. వారిని టార్గెట్ చేయ‌డం.. వారి అక్ర‌మాలు వెలుగులోకి తెస్తున్నామ‌ని అధికార ప‌క్షం టీడీపీ చెబుతుండ‌డం వంటివి ఆస‌క్తిగా మారాయి. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ గ‌తంలో పాద‌యాత్ర చేసిన ప్పుడు.. ప్ర‌స్తావించిన రెడ్ బుక్‌లో ముందుగా అధికారుల పేర్లే ఉన్నాయ‌ని చెప్పారు. అయితే.. ఇప్పుడు మాత్రం వైసీపీ నాయ‌కుల పేర్లే ఉన్నాయ‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం తెర‌మీదికివ‌చ్చిన పేర్లు చూస్తే.. వీరిపై చ‌ర్య‌లు తప్ప‌వ‌న్న‌ట్టుగానే ప‌రిస్థితి ఉంది.
ఎవ‌రెవ‌రు?  ఎందుకు టార్గెట్‌?
1) వైఎస్‌. జ‌గ‌న్‌:  గ‌తంలో టీడీపీ ఎమ్మెల్యేల‌ను పార్టీలోకి తీసుకోవ‌డంతోపాటు..వారు చంద్ర‌బాబు కుటుం బాన్ని, ముఖ్యంగా నారా భువ‌నేశ్వ‌రిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసినా.. చూసీ చూడ‌నట్టే వ్య‌వ‌హ‌రించారు. చంద్ర బాబు కుటుంబాన్ని ఘోరంగా అవ‌మానించారు. నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర చేసిన‌ప్పుడు.. ఖ‌చ్చితంగా దానిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు.
2) ఆర్కే రోజా:  మాజీ మంత్రి రోజా.. రెండు ర‌కాలుగా టార్గెట్ అవుతున్నారు. ఒక‌టి.. చంద్ర‌బాబు, నారా లోకేష్‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డంతోపాటు.. పార్టీపరంగా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించ‌డం. రెండోది నియోజ‌క‌వ‌ర్గం నగ‌రిలో తీవ్ర స్థాయిలో టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై ఒత్తిళ్లు తీసుకురావ‌డం.. పార్టీని లేకుండా చేయాల‌న్న ప్ర‌య‌త్నం.. వంటివి టార్గెట్ చేస్తున్నాయి.

3) అంబ‌టి రాంబాబు:  స‌త్తెన‌ప‌ల్లిలో టీడీపీ నాయ‌కుల‌పై కేసులు పెట్టించ‌డంతోపాటు.. వారి ఆస్తుల‌ను కూడా.. కూల్చేయాల‌న్న ప్ర‌య‌త్నం చేశారు. అలాగే.. చంద్ర‌బాబు, నారా లోకేష్‌ను కూడా ఆయ‌న టార్గెట్ చేశారు. దీంతో అంబ‌టి రాంబాబు టార్గెట్ అయ్యారు. ఒక్క టీడీపీనేకాదు.. జ‌న‌సేన కూడా ఈయ‌న‌ను టార్గెట్ చేసింది.
4) అనిల్ కుమార్ యాద‌వ్‌:  మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్ కూడా.. టీడీపీ నేత‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శించ‌డం.. అసెంబ్లీలో బెదిరింపులు.. నెల్లూరులో కొంద‌రు టీడీపీ నేత‌ల‌ను బెదిరింపులు. వంటివి ఆయ‌న‌ను టార్గెట్ చేసేందుకు కార‌ణంగా మారాయి.
5) ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి:  టీడీపీతోపాటు.. జ‌న‌సేన కూడా టార్గెట్ చేసుకున్న నాయ‌కుడు. ఎమ్మెల్యేగా ఉన్న సమ‌యంలో స‌వాళ్లు రువ్వ‌డం..అక్ర‌మాల‌కు ఊత‌మిచ్చేలా వ్య‌వ‌హ‌రించ‌డం.. ప‌వ‌న్‌కే నేరుగా టార్గెట్ పెట్ట‌డం.. ఓడిస్తామ‌ని శ‌ప‌థాలు చేయ‌డం వంటివి.. ద్వారంపూడిని టార్గెట్ చేశాయి.

6) బొత్స స‌త్య‌నారాయ‌ణ‌:  మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణను టార్గెట్ చేయ‌డం వెనుక వ్య‌క్తిగ‌త కార‌ణాలకంటే.. రాజ‌కీయ కార‌ణాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. బొత్స కార‌ణంగా.. విజ‌య‌న‌గ‌రంలో టీడీపీ ఎదుగుద‌ల లేద‌నేది వాస్త‌వం. ఇప్పుడంటే.. ఓ సునామీలో కొట్టుకొచ్చినా.. భ‌విష్య‌త్తులోనూ బొత్స టార్గెట్ అవుతారు. సో.. అందుకే.. రాజ‌కీయంగా విజ‌య‌న‌గ‌రంలో దూకుడు చూపించాలంటే.. బొత్స‌పై పైచేయి సాధించాల్సి ఉంటుంది. అందుకే ఆయ‌న టార్గెట్ అయ్యారు.
7) కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి:  నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లికి చెందిన మాజీ మంత్రి కాకాణి టార్గెట్ పెద్ద‌గా ఏమీ లేదు. అయితే.. టీడీపీ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి  చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మాత్రం వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌ను టార్గెట్ చేసుకున్నారు. ఇది.. రాజ‌కీయాల్లో స‌హ‌జం. సో.. ఇది త‌ప్ప‌.. కాకాణి విష‌యంలో పెద్ద‌గా టీడీపీ టార్గెట్ చేయాల్సిన అవ‌స‌రం లేదు.
8) పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి:  పుంగ‌నూరు ఎమ్మెల్యే అయిన‌ప్ప‌టికీ.. రాష్ట్ర వ్యాప్తంగా చ‌క్రం తిప్పిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి... టీడీపీ ప్ర‌భుత్వానికి పెద్ద టార్గెట్ అవుతున్నారు. కుప్పంలో చంద్ర‌బాబును ఓడిస్తాన‌ని చెప్ప‌డం.. పుంగ‌నూరులో టీడీపీని అణిచేయాల‌ని ప్ర‌య‌త్నించ‌డం.. పోలీసు యంత్రాంగాన్ని త‌న చెప్పు చేత‌ల్లో పెట్టుకుని టీడీపీ నాయ‌కుల‌పై కేసులు మోప‌డం వంటివి టీడీపీ ఆయ‌న‌ను టార్గెట్ చేసుకునేం దుకు అవ‌కాశం ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే తాజాగా భ‌ద్ర‌త‌ను త‌గ్గించింది.

9) వైవి. సుబ్బారెడ్డి:  వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్బారెడ్డి.. ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీని ప‌క్క‌న పెట్టేందుకు ప్ర‌య‌త్నించారు. పార్టీ ప‌రంగా ఆయ‌న అనేక మంది నాయ‌కుల‌పై ప‌రోక్షంగా కేసులు పెట్టించారు. వ్య‌క్తి గ‌తంగా టీడీపీ నాయ‌కుల‌ను ఏమీ అన‌లేక‌పోయినా.. రాజ‌కీయంగా మాత్రం వైవీ టార్గెట్ అవుతార‌న‌డంలో సందేహం లేదు.
10) స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి:   టీడీపీ టార్గెట్‌లో అప్ప‌టి స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఉన్నారు. చంద్ర బాబుపై స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసు కానీ.. నారా లోకేష్‌పై ఫైబ‌ర్ గ్రిడ్ కేసు కానీ.. అదేవిధంగా అచ్చెన్నా యుడిపై ఈఎస్ ఐ కేసు పెట్టించ‌డంలోనూ.. స‌జ్జ‌ల పాత్ర కూడా ఉంద‌ని టీడీపీ న‌మ్ముతోంది. అదేవిధం గా  టీడీపీని దెబ్బ‌కొట్టేలా ప‌క్కా ప్లాన్‌తో ఈయ‌న కూడా వ్య‌వ‌హ‌రించార‌ని.. టీడీపీ భావిస్తోంది. అందుకే.. ఈయ‌న‌ను టార్గెట్ చేసుకునే అవ‌కాశం ఉంది.
11) విజ‌య సాయిరెడ్డి:  వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు.. విజ‌య‌సాయిరెడ్డి కూడా.. టీడీపీ టార్గెట్‌లో ఉన్న నా యకుడే కావ‌డం గ‌మ‌నార్హం. విజ‌య‌సాయిరెడ్డి టీడీపీ నేత‌ల‌ను వైసీపీవైపు తీసుకురావ‌డంలో స‌క్సెస్ అ య్యారు. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబు, నారా లోకేష్‌పై తీవ్ర‌స్థాయి విమ‌ర్శ‌లు గుప్పించ‌డంలోనూ సాయిరెడ్డి ముందున్నారు. అందుకే ఈయ‌న‌ను రాజ‌కీయంగా టార్గెట్ చేసే అవ‌కాశం ఉంది.

12) మార్గాని భ‌ర‌త్‌రామ్‌:  రాజ‌మండ్రి మాజీ ఎంపీ.. భ‌ర‌త్‌.. రాజ‌కీయంగా టీడీపీని ఇర‌కాటంలో పెట్టారు. రాజ‌మండ్రిలో అప్ప‌టి ఎమ్మెల్యే భ‌వానీ ఏ ప‌నిచేయాల‌న్నా.. అడ్డుకున్నారు. అంతేకాదు.. అంతా త‌న పేరుతోనే జ‌రగాల‌ని.. ప్ర‌తి ప‌నికీ అడ్డుప‌డ్డారు. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలోఆధిప‌త్య పోరు విష‌యంలోనూ భర‌త్ ముందున్నారు. మొత్తంగా.. రాజ‌కీయ ప‌రంగా చూసుకుంటే.. టీడీపీని ఆయ‌న టార్గెట్ చేశారు. రాజ‌ధాని రైతుల పాద‌యాత్రను అడ్డుకున్నారు. చంద్ర‌బాబు జైల్లో ఉంటే.. వ్యంగ్యాస్థ్రాలు సంధించారు. నారా లోకేష్ పాద‌యాత్ర‌ను కూడా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. మొత్తంగా చూస్తే.. మార్గాని భ‌ర‌త్ భారీగానే టార్గెట్ అవుతున్నారు.
13) జోగి ర‌మేష్‌:  మాజీ మంత్రి జోగి ర‌మేష్‌.. మ‌రింత‌గా టీడీపీ టార్గెట్ అయ్యారు. చంద్ర‌బాబు నివాసంపై దాడి కి ప్ర‌య‌త్నం చేయ‌డం.. టీడీపీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం.. వంటివి జోగికి శాపంగా మారాయి. దీంతో ఈయ‌న‌ను టార్గెట్ చేయ‌డం.. టీడీపీ వంతుగా మారింది.
14) దేవినేని అవినాష్‌:  విజ‌య‌వాడ తూర్పు వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న దేవినేని అవినాష్‌.. టీడీపీ విష‌యం లో చూపించిన దూకుడే ఇప్పుడు ఆయ‌న‌కు శాపంగా మారింది. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై దాడి జ‌రిగిన‌ప్పుడు.. అవినాష్ పాత్ర ఉంద‌ని తేల్చారు. అదేవిధంగా విజ‌య‌వాడ‌లో టీడీపీ నాయ‌కుల‌పైనా.. కార్య‌క‌ర్త‌ల‌పైనా కూడా కేసులు పెట్టించారు.

15) పేర్ని నాని:  పేర్ని కుటుంబంలో ముఖ్యంగా ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేసి ప‌రాజ‌యం పాలైన  పేర్ని కిట్టు.. వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. టీడీపీ నాయ‌కుల‌పై కేసులు పెట్టిండం.. కొంద‌రిపై రౌడీ షీట్లు కూడా తీయించ‌డం వంటివి.. పేర్నిని టీడీపీ టార్గెట్ చేసేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది.. ఇక‌, నాని విష‌యానికి వ‌స్తే.. జ‌న‌సేన టార్గెట్ చేసేందుకు అవకాశం ఏర్ప‌డింది. ప‌వ‌న్‌ను దుర్భాష‌లాడ‌డం స‌హా.. ఇత‌ర అంశా లపై తీవ్ర వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డిన నేప‌థ్యంలో నాని.. టార్గెట్ అయ్యారు.
16) స‌జ్జ‌ల భార్గ‌వ రెడ్డి:  అప్ప‌టి స‌ల‌హాదారు సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కుమారుడు. వైసీపీ సోష‌ల్ మీడియా ద్వారా.. టీడీపీపై విషం చిమ్మార‌ని ఆ పార్టీ నాయ‌కులు తీవ్రస్థాయిలో అప్ప‌ట్లో విమ‌ర్శ‌లు గుప్పించారు.  అంతేకాదు.. వ్య‌క్తిగ‌తంగా నారా భువ‌నేశ్వ‌రి స‌హా నంద‌మూరి కుటుంబంపైనా కామెంట్లు చేయించార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో భార్గ‌వ‌రెడ్డికూడా.. టార్గెట్ అయ్యార‌నేది పొలిటిక‌ల్ టాక్.

పైన పేర్కొన్న నేత‌ల‌తో పాటు మ‌రి కొంద‌రు పోలీసు ఉన్న‌తాధికారులు కూడా లోకేష్ రెడ్‌బుక్‌లో ఉన్నారు. టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను బాగా ఇబ్బంది పెట్టిన ఎస్పీలు, సీఐలు, డీఎస్పీలు, ఎస్సైల పేర్ల‌ను సైతం లోకేష్ ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించిన‌ప్పుడు ప్ర‌త్యేకంగా రెడ్‌బుక్‌లో నోట్ చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: