లోకేష్ రెడ్ బుక్.. బాలినేని భరతం పడతాడా..?

Pandrala Sravanthi
- రెడ్ బుక్ లో బుక్కయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి..
- మంత్రిగా ఉండి ప్రజలకు చేసింది ఏమీ లేదు..
- హవాలా,పేకాటలో అందెవేసిన చేయి..

ఒక్కసారి అధికారం రాగానే అహంకారం పెరిగిపోకూడదు. అధికారం అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు. అధికారం ఉన్నా లేకపోయినా మనం ఉండే జాగ్రత్తల్లో ఉంటే బాగుంటుంది. అలా జగన్మోహన్ రెడ్డి 2019లో ఒక్కసారి అధికారంలోకి రాగానే అహంకార ధోరణి చూపించారు. ఆయన చూపించడమే కాదు, ఆయన కింద ఉన్నటువంటి నాయకత్వమంతా మామూలు హైరానా చేయలేదు. రాజ్యాంగ విరుద్ధంగా పాలన చేస్తూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నచ్చిన దందాలు చేసుకున్నారు. టిడిపి కార్యకర్తలను అయితే ఏ కోణాన కూడా నిద్ర పోనివ్వలేదు. ఎవరైనా ఇంటి నుంచి బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకు పంపారు. అడుగడుగునా పోలీసులను వారి పార్టీ కార్యకర్తల్లా వాడుకున్నారు.

అంతే కాదు కొంతమంది పై ఆఫీసర్లు కూడా వారు చెప్పినట్టే వింటూ ముందుకు సాగారు తప్ప రాజ్యాంగంలో వారి రూల్స్ ప్రకారం అస్సలు నడుచుకోలేదు. అలా ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులకు, కొంతమంది ప్రజలకు చుక్కలు చూపించారనుకోండి. ఇక ఇదే తరుణంలో యువగళం పాదయాత్ర పేరుతో నారా లోకేష్ రాష్ట్రమంతా చుట్టారు.  ఈ సమయంలోనే ఆయన ఎదుర్కొన్న సమస్యలను, నాయకులు ఆయనపై ఏ విధంగా  దాడికి దిగారు, వాటిని కూడా రికార్డు చేసుకున్నారు. ఏ అధికారులైతే రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తించారో వారందరి పేర్లు కూడా తన రెడ్ బుక్ లో నమోదు చేసుకున్నారు. వారితో పాటుగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేరు కూడా తన రెడ్ బుక్ లో రాసుకున్నారు. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా..
 టిడిపి యువగళం పాదయాత్ర ఒంగోలు జిల్లాకు చేరినప్పుడు, పోలీసులను అడ్డుపెట్టుకొని  విపరీతంగా టార్చర్ పెట్టారు. అంతేకాదు బాలినేని మంత్రిగా ఉన్న సమయంలో ప్రజలను కూడా ఇష్టం వచ్చినట్లు తిడుతూ రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తించారు. అలాగే ఆయన హవాలా, పేకాటలో కూడా ఆరితేరిపోయారు. ఈ విధంగా ప్రజలతో ఎన్నుకోబడిన నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమాత్రం కూడా బాలినేనికి లేవు.  అంతే కాదు తాను అధికారంలో ఉన్న సమయంలో టిడిపి నాయకులను నారా లోకేష్ ను హేళన చేసి మాట్లాడారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచార సమయంలో టిడిపి కార్యకర్తలపై, నాయకులపై ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరులు కూడా దాడికి పాల్పడ్డారు. ఈ విధంగా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడి అనేక విధాలుగా టిడిపి నాయకులను ఇబ్బందులు పెట్టారు. ముఖ్యంగా ఆయన హవాలా, పేకాటలో పట్టుబడి పదవి పవర్ తో తప్పించుకున్నాడు. ఈ విధంగా ఇన్ని తప్పులు చేసినటువంటి బాలినేని పేరు లోకేష్ రెడ్ బుక్ లో ఉంది. ఆయన ప్రస్తుతం అధికారంలోకి వచ్చి మంత్రి పదవి చేపట్టారు. మరి ఈ రెడ్ బుక్ లోంచి బాలినేని శ్రీనివాస్ పేరు తీసి, పాత కేసులన్నీ  బయటకు తీయించి, విచారణ చేయించి ఆయనను జైల్లోకి తోస్తారా? లేదంటే ఇంకేమైనా చేస్తారా? అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: