పవన్ కల్యాణ్ కు అవమానం...శిష్యుడిని చూసి బాబు నేర్చుకోవాల్సిందేనా?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత.... టిడిపి కూటమి ప్రభుత్వం దూసుకు వెళ్తోంది. ఏపీ ప్రజల కష్టాలు తీర్చే దిశగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన అనుభవాన్ని మొత్తం.. బయటికి తీసి ఏపీ అభివృద్ధికి పాటుపడుతున్నారు. అటు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా.... చాలా విషయాలు తెలుసుకొని మరి ఏపీ ప్రజల కోసం పనిచేస్తున్నారు.
 

అయితే ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ముసలం  చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహారం పై జనసైనికులు చాలా సీరియస్ గా ఉన్నారట. పవన్ కళ్యాణ్ ను పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు...  ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని జనసైనికులు భావిస్తున్నారు. మొన్న ఈనాడు  అధినేత రామోజీరావు  సంతాప సభ సందర్భంగా... పవన్ కళ్యాణ్ ఫోటో లేకుండా కేవలం చంద్రబాబు ఫోటోతో... పత్రికా ప్రకటనలు ఇచ్చారు.
 

దీంతో జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మొన్న ఒకటో తారీకున... పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే.  అయితే... ఈ పెన్షన్ కార్యక్రమం నేపథ్యంలో కూడా.... ఇచ్చిన పత్రిక ప్రకటనలో కేవలం సీఎం చంద్రబాబు ఫోటో మాత్రమే  ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఫోటో ప్రకటనలో ఎక్కడ కనిపించలేదు. దీంతో జనసైనికులు... తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక... మొన్న చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ అలాగే కేంద్ర పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు.ఈ సందర్భంగా... డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న  పవన్ కళ్యాణ్ చంద్రబాబు తీసుకుపోలేదు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తే కచ్చితంగా.. డిప్యూటీ ముఖ్యమంత్రి  బట్టి విక్రమార్కను తీసుకువెళ్తారు. కానీ పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు తీసుకువెళ్లలేదు. దీంతో మరోసారి జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను డామేజ్ చేస్తున్నాడని చంద్రబాబుపై ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: