పెన్షన్: అలాంటి వాళ్లను తొలగించనున్న ఏపీ ప్రభుత్వం.!

Divya
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామందికి పెన్షన్ పెంచడం జరిగింది.. దీంతో అందరూ ఆనందంగా ఉన్నప్పటికీ. ఇప్పుడు తాజాగా పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం ఒక భయాన్ని సృష్టించేలా చేస్తోంది. అదేమిటంటే రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 2,50,000 లక్షల మంది దొంగ పెన్షనర్లు ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అన్ని వివరాలు అధికారులతో మాట్లాడిన తర్వాత విడుదల చేసే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు రకాల ఉత్తర్వులను జారీ చేశారు. ఇందులో చాలా అవకతవకలు ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది.

ఉదాహరణకు ఆధార్లో వయసు మార్చుకొని మరియు వికలాంగుడు కాకపోయినప్పటికీ వికలాంగుల పెన్షన్ మరియు ఒంటరి మహిళ కాకపోయినా పెన్షన్ మరియు వితంతు పెన్షన్లను చాలా అక్రమంగా పొందుతూ ఉన్నారట. మరి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నప్పటికీ పెన్షన్లు పొందుతూ అర్హులైన వారికి అడ్డగోలుగా గత ప్రభుత్వం దోచిపెట్టిందనే విధంగా కూటమి ప్రభుత్వం తెలియజేస్తున్నారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు ఇలాంటి వాటిపైన అధికారులు దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. భారీగా మండల స్థాయి అధికారులను కూడా ఇలాంటి అవకతవకల పైన సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుకుంటున్న పెన్షన్ పైన ఏపీ సీఎం చంద్రబాబు చాలానే సీరియస్ గా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఫేక్ పెన్షన్లు అందుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్ వంటిది.. మరి రాబోయే రోజుల్లో మరి ఎంతమంది ఇలాంటి ఫేక్ పెన్షనర్లు  బయటపడతారో చూడాలి మరి. ఇప్పటికే మేనిఫెస్టోలో చెప్పినటువంటి కొన్ని హామీలను సైతం చంద్రబాబు అమలు చేస్తూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా చాలా ప్రాంతాలను తిరుగుతూ సమస్యలను తెలుసుకొని మరి వాటికి సంబంధించిన సొల్యూషన్ కూడా పరిష్కారం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే పెన్షనర్లకు కాస్త ఈ విషయం ఆందోళన కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: