ఏపీ: ఉండలేనంటూ వెళ్ళిపోతానంటున్న వైసిపి నేత..!

Divya
2024 ఎన్నికలలో భాగంగా చాలామంది వైసిపి నేతల రాజకీయ పరిస్థితి డైలమాలో పడింది. వైసీపీలో ఇద్దరు అన్నదమ్ములు సైతం ఒక వైసీపీ నేతకు  చెక్ పెడుతున్నారు. ఇటీవలే ఎన్నికలలో గెలిచిన స్థానాల తమ్ముడు ఆధిపత్యం కొనసాగుతూ ఉంటే..2019 లో గెలిచిన నియోజకవర్గం లో అన్న పెత్తనం చేస్తున్నాడు. అన్నదమ్ముల రాజకీయ మధ్య నలిగిపోతున్న ఆ రాజకీయ నేత ఎవరు.. ఏ నియోజకవర్గము ఇప్పుడు చూద్దాం.


మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు.. ప్రకాశం పాలిటిక్స్ లో పరిచయం చేయలేనటువంటి పేరు. ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయంగా ఎంట్రీ ఇచ్చి.. కాంగ్రెస్ టిడిపి వంటి పార్టీలలో కూడా పనిచేసి వైసిపి పార్టీలోకి ఎంట్రి ఇచ్చారు. వైసీపీలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.. ఇప్పుడు ఈయన పొలిటికల్ ఫ్యూచర్ హార్ట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికలలో గిద్దలూరు నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. 2024 ఎన్నికలలో నియోజవర్గంలో మారి మార్కాపురం నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. ప్రస్తుతం ఈయన ఏ నియోజకవర్గపు బాధ్యతలలో ఉన్నారా అర్థం కాలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో ప్రాతినిధ్యం వహించిన గిద్దలూరు నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి పెత్తనం చెలాయిస్తున్నారట.

ఇటీవల పోటీ చేసి ఓడిపోయిన మార్కాపురంలో నాగార్జున రెడ్డి తమ్ముడు కృష్ణమోహన్ రెడ్డి ఆదిపత్య రాజకీయాలను నడుపుతున్నారట. ఈ రెండు నియోజకవర్గాల అన్నదమ్ముల పెత్తనం కనిపిస్తోందట. దీంతో అన్నా రాంబాబు పరిస్థితి ఎటు కదలలేని పరిస్థితిగా మారిపోయిందట. కాంట్రాక్టర్ గా పనిచేసిన అన్నా రాంబాబు మొదట 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ ఏడాది గిద్దలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టిడిపి నుంచి పోటీ చేయగా.. ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీ పార్టీల చేరి భారీ మెజార్టీతో గెలిచారు. 2024 ఎన్నికలలో సొంత పార్టీతోపాటు ప్రజలలో కూడా ఈయన పైన వ్యతిరేకత మొదలయ్యిందట. వైసిపి నాయకులు వ్యతిరేకంగా కూటమి కట్టడంతో పాలిటిక్స్ చేయలేమంటూ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయట. దీంతో వైసిపి నేతలు అన్నా రాంబాబుని తాడేపల్లికి పిలిపించి మరి సర్ది చెప్పడం జరిగింది. అయినా కూడా 2024 లో ఓడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: