రెడ్ బుక్ దెబ్బకు కొడాలి విలవిల.. లోకేశ్ టార్గెట్ చేస్తే నానికి ఇబ్బందేనా?

Reddy P Rajasekhar
ఏ రాజకీయ పార్టీకి అయినా అధికారం శాశ్వతం కాదు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకున్న పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని కచ్చితంగా సొంతం చేసుకుంటుందని చెప్పలేం. ప్రజలు తాము ఎన్నుకున్న నేతలు మంచి పాలన అందించాలని భావిస్తారే తప్ప ఎప్పుడూ ఇతర పార్టీ నేతలపై విమర్శలు చేయాలని భావించరు. లోకేశ్ రెడ్ బుక్ దెబ్బకు కొడాలి నాని టెన్షన్ పడే పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు.
 
2024 ఎన్నికల్లో కొడాలి నానికి భారీ షాక్ తగిలిందనే సంగతి తెలిసిందే. కొడాలి నాని ఎంత కష్టపడినా ఫలితాలు మాత్రం అనుకూలంగా రాలేదు. లోకేశ్ రెడ్ బుక్ ను ఓపెన్ చేస్తే మాత్రం కొడాలి నానికి ఇబ్బందేనని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. బూతులు, వెకిలి చేష్టలు, పరుష పదజాలంతో విమర్శలు చేయడం ద్వారా కొడాలినాని తన స్థాయిని తానే తగ్గించుకున్నారని గతంలోనే కామెంట్లు వ్యక్తమయ్యాయి.
 
నారా లోకేశ్ టీడీపీ మూడో తరం నాయకుడు కాగా ఈ ఎన్నికల్లో లోకేశ్ ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రి పదవి కూడా దక్కడంతో పార్టీలో కీలకంగా మారారు. అయితే రెడ్ బుక్ ద్వారా లోకేశ్ కొడాలి నానిని ఏ విధంగా టార్గెట్ చేస్తారనే చర్చ సైతం జరుగుతోంది. నారా లోకేశ్ విమర్శలకు తావివ్వకుండా విమర్శించిన నేతలకు బుద్ధి వచ్చేలా చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
నారా లోకేశ్ అంచలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తండ్రి వారసత్వం ఉన్నా గత ఐదేళ్లుగా మంగళగిరికే పరిమితమై మంగళగిరి ఓటర్ల మనస్సు గెలుచుకుని నారా లోకేశ్ విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల తర్వాత నారా లోకేశ్ సైలెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. నారా లోకేశ్ భవిష్యత్తులో సీఎం కావడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. లోకేశ్ రెడ్ బుక్ ఓపెన్ చేస్తే మాత్రం చాలామంది వైసీపీ నేతలకు ఇబ్బందేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: