రేవంత్ కు ఎదురుదెబ్బ...కాంగ్రెస్ కు ఎమ్మెల్యే రాజీనామా ?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలో విచిత్ర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు... ఏ పార్టీలోకి వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం గులాబీ పార్టీ సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో... ఆ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి దూకేశారు. మరి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి... ఊహించని షాక్ తగిలింది. అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు రావాల్సింది పోగా... ఆ పార్టీకే... సొంత ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి...  రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి... ఇండిపెండెంట్గా లేదా వేరే పార్టీలో చేరేందుకు... రంగం సిద్ధం చేసుకున్నారట.

దీనికి కారణాలు లేకపోలేదు. శనివారం రోజున వరంగల్ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా అనేక సంక్షేమ కార్యక్రమాలలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అయితే వరంగల్లో దాదాపు అన్ని సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ... మంచి ఊపులో ఉంది.  అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ రేవంత్ రెడ్డి కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు. కానీ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూర్ కు ఎమ్మెల్యే డుమ్మా కొట్టడంతో... దొంతి మాధవరెడ్డి పార్టీ మారబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కేబినెట్లో తనకు మంత్రి పదవి రాలేదని..  బాధలో దొంతి మాధవరెడ్డి ఉన్నారని సమాచారం. ఇప్పుడు వచ్చే కేబినెట్ విస్తరణలో కూడా ఆయన పేరు లేదని సమాచారం. వరంగల్ జిల్లా నుంచి కడియం శ్రీహరికి... అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోజనలో దొంతి మాధవరెడ్డి ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: