బాబు - రేవంత్ : ఒకే వేదికపైకి గురువు- శిష్యులు?

Veldandi Saikiran
గురువు, శిష్యులుగా పేరు ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటి కాబోతున్నారు. ఒకటంటే కలిసి వెళ్లడం కాకుండా... ఒకే వేదిక మీద కనిపించనున్నారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ వేదిక కానుంది. ప్రపంచ కమ్మ మహాసభ హైదరాబాద్ మహానగరంలో చాలా గ్రాండ్ గా జరగబోతుంది. అయితే ఈ ప్రపంచ కమ్మ మహాసభకు... రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాబోతున్నారు.
 

కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జూలై 20వ తేదీ, జూలై 21వ తేదీలలో తొలి ప్రపంచ కమ్మ మహాసభ జరగనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు కమ్మ సంస్థ వ్యవస్థాపకులు జట్టి కుసుమ కుమార్. ఇక ఈ కార్యక్రమానికి... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి  వెంకయ్య నాయుడు హాజరు కాబోతున్నారు. ఈ విషయాన్ని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు చెప్పారు.
 దేశ జనాభాలో 1.5%... అలాగే వరల్డ్ వైడ్ గా 2.1 కోట్ల మంది కమ్మ సామాజిక వర్గీయులు... ఉన్నారని... వారందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి... వ్యవస్థాపకులు జట్టి కుసుమ కుమార్ తెలిపారు. అయితే ఈ కమ్మ సామాజిక మహాసభలకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కావడం... ఇప్పుడు చర్చనీయాంశం అయింది. గతంలో చంద్రబాబు పార్టీలోనే సీఎం రేవంత్ రెడ్డి పనిచేశారు. ఆయన నమ్మిన బంటుగా.. రేవంత్ రెడ్డి పనిచేయడం జరిగింది.
 

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ పూర్తిగా  నశించిపోయింది. దీంతో రేవంత్ రెడ్డి ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. కాలక్రమైనా ఆయన ముఖ్యమంత్రి కావడం కూడా జరిగింది. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో... రేవంత్ రెడ్డికి ఇన్ డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఇచ్చారు. టిడిపి పోటీ చేయకపోవడం కారణంగా... తెలంగాణలో 10 శాతం ఓట్ బ్యాంకు కాంగ్రెస్కు కన్వర్ట్ అయింది. ఇలా చంద్రబాబు అలాగే రేవంత్ రెడ్డి మధ్య  గురువు శిష్యుల బంధం ఇంకా కొనసాగుతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: