కేసీఆర్ బిగ్ స్కెచ్: ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలతో చర్చలు?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. గులాబీ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఎప్పుడు జారిపోతారో అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. కెసిఆర్ పెట్టిన మీటింగ్ కు వెళ్తున్నారు... తెల్లవారి రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకుంటున్నారు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా... మధ్యాహ్నం వరకు గులాబీ పార్టీ నేతలతో తిరిగి...అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

ఈ నేపథ్యంలో మరో 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేర్తారని దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాదులో గులాబీ పార్టీ టికెట్ తరఫున గెలిచిన  ఎమ్మెల్యేలు జారిపోతారని ఆయన వెల్లడించారు. దీంతో అలర్ట్ అయిన కేసీఆర్... వెంటనే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్ కు రావాలని  ఆదేశించారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్  ఎమ్మెల్యేలతో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా వెంటనే.. కెసిఆర్ ఫామ్ హౌస్ కు చేరుకున్నారు.
ఈ సందర్భంగా కెసిఆర్ తో భోజనం చేసి... తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. గులాబీ పార్టీ తరఫున గెలిచి బయటకు వెళ్లిన వారిని వదిలేది లేదని... వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే స్పీకర్కు కూడా కంప్లైంట్ ఇచ్చారు. త్వరలోనే సుప్రీంకోర్టు మెట్టు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యేలతో చెప్పారు. ఇది ఇలా ఉండగా.. మొన్నజరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. అధికారం కోల్పోయింది గులాబీ పార్టీ.
 

ఈ సందర్భంగా 39 స్థానాలకే పరిమితమైంది టిఆర్ఎస్ పార్టీ.  ఇక ఇందులో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురు మరణించగా.... భద్రాచలం, స్టేషన్ ఘనపూర్, ఖైరతాబాద్, జగిత్యాల, బాన్సువాడ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా... జారుకుంటారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన కేసీఆర్ వెంటనే ఎమ్మెల్యేలతో చర్చలు చేశారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... మళ్లీ టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని కేసీఆర్ చెప్పారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: