చంద్రబాబు : ఎంపీ లావుకు కీలక పదవి ఇవ్వడానికి అదే కారణం..!

FARMANULLA SHAIK
సీఎం చంద్రబాబు అధ్యక్షతన శనివారం టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను నియమించారు.అలాగే డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నంద్యాల నుంచి తొలిసారి ఎంపీగా గెలిచిన బైరెడ్డి శబరికి అవకాశం కల్పించారు.కోశాధికారిగా దగ్గుమల్ల ప్రసాద్‌ను నియమించడం జరిగింది. ఎంపీ 'లావు' నరసారావుపేట నుంచి రెండోసారి ఎంపీగా గెలవగా నంద్యాల నుండి 'శబరి' తొలిసారి గెలిచారు. ఈ ఇద్దరూ కూడా ఎన్నికల ముందు టీడీపీలో చేరిన వారే.ఈ నెల 24 నుంచి లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీడీపీకి 16 మంది ఎంపీల బలం ఉన్నందున రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రతీ ఎంపీ ప్రథమ కర్తవ్యం కావాలని చంద్రబాబు సూచించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా కలిసికట్టుగా ఎంపీలు అందరూ ఉండాలని ఏ మాత్రం సందేహాలున్నా సరే వెంటనే తనకు తెలియజేయాలని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎంపీలకు చంద్రబాబు చెప్పారు.అయితే టీడీపీ సీనియర్ నేతల్లో పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలను ఎంపిక చేయడం అనేదానిపై కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సీనియర్ ఎంపీలను కాదని ఎన్నికలకు ముందు వైసీపీ నుండి వచ్చిన శ్రీకృష్ణదేవరాయలకు పార్లమెంటరీ పార్టీ నేతగా ఛాన్స్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నరసారావుపేట ఎంపీ టికెట్ విషయంలో వైసీపీ అధినేత జగన్‌తో తేడాలు రావడంతో లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. టీడీపీ నుండి నరసారావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన లావు  వైసీపీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు.చంద్రబాబు ఇలాంటి డెసిషన్ తీసుకునే వెనకాల ఒక స్ట్రాంగ్ కారణం ఉండక మానదు అని మరికొంతమంది అభిప్రాయం.అయితే లావు విషయానికి వస్తే ఆయన 2014 లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2019లో నరసరావుపేట నుంచి వైకాపా తరఫున పోటీచేసి తెదేపా అభ్యర్థి రాయపాటి సాంబశివరావుపై గెలిచారు.

ఈ ఎన్నికల్లో తెదేపా తరఫున నరసరావుపేట నుంచే పోటీ చేసి మరోసారి గెలుపొందారు. 2019-24 మధ్య ఎంపీగా ఉన్న సమయంలో వరికపూడిశెల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకురావడంలో కష్టపడ్డారు. రూ.10.61 కోట్లతో నకరికల్లు మండలంలో ఇండో-ఇజ్రాయెల్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. తక్కువ పెట్టుబడులతో కూరగాయలు, వరి పండించి, రైతులకు లాభాలు తీసుకురావడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. రూ.మూడువేల కోట్లతో జిల్లాలో పలు జాతీయ రహదారులను మంజూరు చేయించడమే కాకుండా పనులు జరుగుతున్నాయి. కొన్ని పనులు తుది దశలో ఉన్నాయి. రెండు కేంద్రీయ విద్యాలయాలను కూడా జిల్లాకు మంజూరు చేయించారు. మొదటిసారి ఎంపీగా ఉన్న సమయంలో జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యులయ్యారు. ఈసారి ఎలాగైనా వరికపూడిశెల ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగేలా చూస్తానని మాట ఇచ్చారు. 2019-24 మధ్య జిల్లాకు చేసిన అభివృద్ధితో రెండోసారి పల్నాడు వాసులు లావును గెలిపించారు.నాపై నమ్మకం ఉంచి పెద్ద బాధ్యతలు అప్పగించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నా. రాష్ట్రానికి రావాల్సిన పలు ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేంద్ర ప్రాజెక్టులనూ పూర్తి చేసేలా తీవ్రంగా కృషి చేస్తా. అంతేకాకుండా నా కష్టాన్ని చూసి రెండోసారి గెలిపించిన పల్నాడు వాసులందరికీ ధన్యవాదాలు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: