తెలంగాణ: కాలర్ పట్టుకొని మరీ అరెస్ట్ కాబడ్డ బీఆర్ఎస్ నాయ‌కుడు!

Suma Kallamadi
బీఆర్ఎస్ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న బాల్క సుమ‌న్ తాజాగా అరెస్ట‌య్యారు. ఇక పోలీసులు అతనిని అరెస్టు చేసే స‌మ‌యంలో వ్య‌వ‌హ‌రించిన తీరు మాత్రం ఇపుడు పలు విమర్శలకు దారి తీస్తోంది. విషయం ఏమిటంటే... బాల్క సుమ‌న్ ని పోలీసులు కాల‌ర్ ప‌ట్టుకుని మరీ గుంజుకొని జీపులోకి బ‌ల‌వంతంగా తోసివేసారు. దాంతో ఈ ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ నాయ‌కులు తీవ్ర అభ్యంతరం వ్య‌క్తం చేస్తున్నారు. పోలీసుల తీరు.. ప్ర‌భుత్వ తీరుకు అద్దం ప‌డుతోంద‌ని బీఆర్ఎస్ నాయ‌కులు విమర్శిస్తున్నారు.
ఇకపోతే బీఆర్ఎస్ అగ్ర‌నేత‌గా గుర్తింపు పొందిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ తాజాగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి అందరికీ తెలిసినదే. ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ హైదరాబాద్‌ లోని పోచారం శ్రీనివాస్ ఇంటి దగ్గర ఆందోళ‌న‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో ఉండి, ప‌ద‌వులు అనుభవించి, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి పార్టీకి ద్రోహం చేశారంటూ.. నిప్పులు చెరిగారు. దానికి ముందు పోచారం ఇంట్లోకి బీఆర్ఎస్ నేతలతో క‌లిసి వెళ్లేందుకు సుమ‌న్ యత్నించారు. ఈ నేప‌థ్యంలో బాల్క సుమన్ పోలీసులతో వాగ్వాదానికి దిగి.. తాము సంఘ‌విద్రోహ శ‌క్తులం కాదంటూ అడ్డుకున్న పోలీసులను ప్ర‌శ్నించారు. ఈ క్రమంలోనే అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది.
ఈ నేపథ్యంలో పోలీసులు... "ఇప్పుడు ఇక్కడ ఆందోళ‌న‌లు వ‌ద్దు.. సీఎం వస్తున్నారు" అని చెప్పగా వారు మాట వినలేదు. దాంతో పోలీసులు బాల్క సుమన్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ స‌మ‌యంలో ఓ కానిస్టేబుల్ .. సుమ‌న్ కాల‌ర్ ప‌ట్టుకుని వాహ‌నంలోకి బ‌ల‌వంతంగా నెత్తిన దృశ్యాలు వైర‌ల్ అవుతున్నాయి. దాంతో బీఆర్ఎస్ నాయ‌కులు తీవ్రంగా ఖండిస్తున్నారు. శాంతి యుతంగా ధ‌ర్నా చేస్తుంటే స‌ర్కారు ఓర్చుకోలేక బీఆర్ఎస్ నాయ‌కులపై అరాచక చర్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు. ఇక తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్వ‌యంగా రేవంత్‌, భ‌ట్టి విక్ర‌మార్క‌లు ఆయ‌న ఇంటికి వ‌చ్చి.. పార్టీ కండువా క‌ప్పి మ‌రీ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: