టీఆర్‌ఎస్‌ కు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్‌ బై..కాంగ్రెస్‌ లోకి మరో 20 మంది ?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. గులాబీ పార్టీలో ఉన్న ఒక్కో ఎమ్మెల్యే జారుకుంటున్నారు. దాదాపు పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో... అధికారంలో ఉన్న గులాబీ పార్టీ... మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జీరో స్థానాలకి పరిమితమైంది గులాబీ పార్టీ. ఇలాంటి నేపథ్యంలో... గులాబీ పార్టీపై నమ్మకం కోల్పోతున్నారు ఒక్కో ఎమ్మెల్యే. దీంతో కాంగ్రెస్ లేదా బిజెపి వైపు చూస్తున్నారు.
ఇప్పటికే గులాబీ పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి,  అలాగే దానం నాగేందర్ అందరూ కాంగ్రెస్కు వెళ్లారు. ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సమక్షంలో చేరారు. ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి త్వరలో కాంగ్రెస్ గూటికి చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.  అటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురు  మరణించడంతో ఆ సీటు కూడా మొన్నటి ఎన్నికల్లో కోల్పోయింది ఈ గులాబీ పార్టీ.
మొన్నటి ఎన్నికల్లో 39 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న గులాబీ పార్టీ...  ఇప్పుడు 34కు పడిపోయింది. ఇంకా మరి కొంతమంది నేతలు జారుకునే ఛాన్స్ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద రెడ్డి , మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి, కాల యాదయ్య, మహిపాల్ రెడ్డి,ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే, ప్రకాష్ గౌడ్, కొత్త ప్రభాకర్, అరికపూడి గాంధీ, కూకట్పల్లి ఎమ్మెల్యే ఇలా చాలామంది ఎమ్మెల్యేలు... ఖాళీ అవుతారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని చిట్ చాట్ లో దానం నాగేందర్ వెల్లడించారు.
20 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యే లు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని దానం నాగేందర్ బాంబు పేల్చారు.  గులాబీ పార్టీలో... పళ్ళ రాజేశ్వర్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి తప్ప అందరూ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వెల్లడించారు. మరి ఇలా పార్టీ మారే వారిపై కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ లపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ చుట్టు తిరుగుతున్నారు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: