సీఎం చంద్రబాబు ముందు.. బిజెపి మూడు రిక్వెస్టులు?

praveen
మొన్నటి వరకు ప్రతిపక్షనేతగా ఉండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.. ఇక మొన్నటికి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం జనసేన, బిజెపి పార్టీలతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగి అఖండ విజయాన్ని సాధించారు. ఈ క్రమంలోనే ఇటీవల ఏపీలో కొత్త ప్రభుత్వం కూడా కొలువుదిరింది అన్న విషయం తెలిసిందే.  అయితే అటు చంద్రబాబుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడా సీట్లు దక్కిన నేపథ్యంలో.. కూటమిలో ఉన్న బిజెపి, జనసేన పార్టీలను పక్కకు పెట్టే అవకాశం ఉంది అని అందరు అనుకున్నారు.

 కానీ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఏకంగా కూటమిలోని జనసేన బిజెపి పార్టీలకు కూడా సమన్యాయం చేసేలా మంత్రి పదవులను కట్టబెట్టడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ రెండు పార్టీలను కలుపుకొని పాలన సాగించేందుకు రెడీ అవుతున్నారు. కాగా నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతుండగా.. మొన్న ఎన్నికల్లో గెలిచిన నేతలందరూ నేడు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇకపోతే ఇప్పుడు కూటమిలో భాగంగా కొనసాగుతున్న బిజెపి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు మూడు వినతులను పెట్టింది అన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని బిజెపిలోని కొంతమంది నేతలు ఇటీవలే మర్యాదపూర్వకంగా కలిశారు అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు సీఎం చంద్రబాబుకి మూడు వినతులు సమర్పించారట. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం మాఫియా పై విచారణ జరపాలని రిక్వెస్ట్ చేశారట. అదే సమయంలో ఇక యదేచ్చగా సాగిన ఇసుక మాఫియా పై కూడా సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారట  ఇక అలాగే రాష్ట్రంలో బిజెపి రాష్ట్ర కార్యాలయం కోసం స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చంద్రబాబుకు కూడా సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: