స్టార్ హీరోలతో చేయాలంటే ఆదర్శకులకు వేరే ఆప్షన్ లేదా.. అందుకే ఇలాంటి ప్రయత్నాలు..?

MADDIBOINA AJAY KUMAR
కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమా మార్కెట్ చాలా చిన్నది. కేవలం మన తెలుగు భాషలో సినిమాలు విడుదల అవుతూ ఉండేవి. దానితో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలకు కూడా పెద్ద ఎత్తున కలెక్షన్లు వచ్చేవి కావు. ఇప్పుడు మాత్రం తెలుగు సినిమా పరిధి చాలా పెద్దది అయ్యింది. చాలా సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్నాయి. ఇక అలాంటి సినిమాలకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినట్లు అయితే వందల కోట్ల కలెక్షన్లను రాబడుతున్నాయి. దానితో చాలా మంది దర్శకులు పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

అలాగే హీరోలు , నిర్మాతలు కూడా ఫ్యాన్ ఇండియా సినిమాల వైపే దృష్టిని పెడుతున్నారు. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలు మాత్రం వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెడుతున్నారు. దానితో దర్శకులు కూడా ప్లాన్ ఇండియా సినిమాలనే చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దానితో కొన్ని   కథ లలో దమ్ము లేకపోయినా పాన్ ఇండియా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. అలాంటి సినిమాల వల్ల నిర్మాతకు పెద్ద మొత్తంలో నష్టాలు తప్పిస్తే లాభాలు రావడం లేదు.

ఎందుకు అంటే పాన్ ఇండియా సినిమా తీయాలి అంటే ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది. అలాగే హీరో ఇతర నటీనటులు కూడా ఎక్కువ రోజులను కేటాయించవలసి ఉంటుంది. దాని వల్ల రెమ్యూనరేషన్లు కూడా భారీగా పెరుగుతాయి. ఇంత జరిగిన తర్వాత సినిమాకు హిట్ టాక్ వస్తే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. కానీ ప్లాప్ టాక్ వస్తే మాత్రం భారీ ఎత్తున నిర్మాతకు నష్టాలు మిగిలే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాల ద్వారా పెద్ద మొత్తంలో నష్టాలను చూసిన నిర్మాతలు కూడా చాలా మందే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: