స్పీకర్ ఎన్నిక..అధికారాలు...అసెంబ్లీ అంతా ఆయన గుప్పిట్లోనే ?

Veldandi Saikiran
* ఎమ్మెల్యేల చేత స్పీకర్ ఎన్నిక
* 5 ఏళ్ల పాటు స్పీకర్ పదవీ కాలం
* ఎమ్మెల్యేలను కంట్రోల్‌ చేసే శక్తి
* అసెంబ్లీ మొత్తం స్పీకర్‌ గుప్పిట్లోనే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన నేపథ్యంలో... ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ప్రమాణస్వీకారం చేసేందుకు.... ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ ఎన్నిక, స్పీకర్ విధి విధానాలు  ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

స్పీకర్ ఎన్నిక

స్పీకర్ ఎన్నిక అనేది అసెంబ్లీ సమావేశాలలో చాలా కీలకమైనది. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఒకరిని అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నుకుంటారు. చాలావరకు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే స్పీకర్గా ఉంటారు. ఈసారి అయ్యన్నపాత్రుడికి స్పీకర్ పదవి వస్తుందని సమాచారం. స్పీకర్ పదవి పొందాలంటే కచ్చితంగా... ఎమ్మెల్యేగా గెలవాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్పీకర్గా బాధ్యత తీసుకోవాలి. మన ఇండియా రాజ్యాంగంలోని ఆర్టికల్ 178 ప్రకారం... ఈ ఎన్నిక ఉంటుంది.
ఇక స్పీకర్ విధివిధానాలు, అధికారాలు

శాసనసభలో అసెంబ్లీ స్పీకర్ విధివిధానాలను రూల్ 7,8,9 లో పేర్కొన్నారు.అసెంబ్లీలో... సభ్యుల మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు స్పీకర్. ఏ శాసనసభ్యుడు పైన అయినా చర్యలు తీసుకునే హక్కు కేవలం స్పీకర్కు మాత్రమే ఉంటుంది. స్పీకర్ కు కోపం వస్తే... ఎవరినైనా అసెంబ్లీ నుంచి బయటికి పంపించవచ్చు. ఇక ప్రభుత్వం తీసుకు వచ్చిన బిల్లులను... ఆమోదిస్తారు. అయితే ప్రభుత్వం వివాదాస్పద బిల్లులను తీసుకువస్తే... ఓటింగ్ నిర్వహించి.. ఆ తర్వాత ముందుకు వెళ్తారు. అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వస్తే... స్పీకర్ అదే దారిలో వెళ్తారు.
ఇక ఎవరైనా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే... దాన్ని ఆమోదించే హక్కు స్పీకర్కు ఉంటుంది. రాజ్యాంగ ఉల్లంఘన చేసిన ఎమ్మెల్యేలపై...  అనర్హత వేటు వేసే హక్కు కూడా స్పీకర్కు ఉంటుంది. అలాంటి స్పీకర్ పదవీకాలం ఐదు సంవత్సరాలు. అయితే మద్యాంతరంగా స్పీకర్ రాజీనామా చేస్తే... తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్ కు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక స్పీకర్ను... తొలగించేందుకు అవిశ్వాస తీర్మానం కూడా ఎమ్మెల్యేలు పెట్టవచ్చు. ప్రకరణ 94 ప్రకారం అసెంబ్లీ స్పీకర్ ను తొలగించవచ్చు. ఇక అసెంబ్లీ స్పీకర్ల జీతాలు... లక్షకు పైగా ఉంటాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్పీకర్ ఒక్కో విధంగా... జీతాలు తీసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: