రైతులకు గుడ్ న్యూస్.. 14 పంటలకు మద్దతు ధర పెంపు..!

Divya
దేశంలోనే రైతులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక గుడ్ న్యూస్  సైతం తెలియజేసింది. 14 ఖరీఫ్ సీజన్ పంటలకు కనీస మద్దతు ధరను కేంద్రం నిన్నటి రోజున పెంచినట్టుగా తెలుస్తోంది. ప్రధాని మోది తమ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్న అశ్వని వైష్ణవ్ మీడియా ముందుకు వచ్చి వివరించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో వరి, మినుములు, రాగి ,పత్తి, మొక్కజొన్న, జొన్న పంటలతో సహా 14 ఖరీఫ్ సీజన్ల పంటకు సైతం కనీసం మద్దతు ధరలను పెంచినట్లుగా తెలుస్తోంది.

ముఖ్యంగా వరికి కనీస మద్దతు ద్వారా కింటాకు 117 రూపాయలు పెంచినట్లు తెలుస్తోంది. దీంతో మద్దతు ధర 2300 రూపాయలకు చేరింది. అలాగే మొక్కజొన్నకు 135 రూపాయలు పెంచి కొత్త ధర రూ.2,225 రూపాయలు ఉన్నది. అలాగే రాగులకు 444 పెంపక.. క్వింట ధర 4,290 రూపాయలు కలదు. మినుములకు 450 రూపాయలు పెంపక..7,400 రూపాయలకు చేరింది. కందులు 550 కి పెంపక.. 7550 రూపాయలకు చేరింది. సన్ఫ్లవర్ విత్తనాల విషయానికి వస్తే 520.. 7,280 రూపాయలకు చేరింది. అలాగే పెసర్లు 124 రూపాయలు పెంచగా..8,862 రూపాయలకు చేరింది.. నైగర్ విత్తనాలు 983 రూపాయలు పెంచగా..8,717 రూపాయలకు చేరింది.. వేరుశెనగ 406 రూపాయలు పెంపక 6,783 రూపాయలకు చేరింది. సోయాబీన్స్ 292 పెంచగా..4,892 రూపాయలకు చేరింది.. నువ్వులు 632 రూపాయలు పెంచగా..9,267 రూపాయలకు చేరింది.. పత్తి 501 రూపాయలు పెంచగా 7,121 చేరింది. సజ్జలు 125 రూపాయలు పెంచగా 2,625 రూపాయలకు చేరింది. జొన్నలు హైబ్రిడ్ 191 రూపాయలు పెంచగా 3,371 రూపాయలకు చేరింది. ఇవన్నీ కూడా క్వింటాకు పెంచినట్టు

కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయంతో రైతులకు కాస్త ఊరట కలిగిస్తోంది. ప్రధాన మోడీ ఎప్పుడు కూడా రైతులను ప్రాధాన్యత ఇస్తూ ఉంటారని నిన్నటి రోజున జరిగిన క్యాబినెట్ మీటింగ్లో  రైతుల సంక్షేమం కోసమే ఇలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నామని అశ్వని వైష్ణవ్ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: