జగన్ బతికుండగా టీడీపీ నేతలకు ఆ సంతోషం ఉండదు..??

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ స్థాపించిన పదేళ్లలోనే అధికారంలోకి వచ్చింది. ఒకసారి 60 కి పైగా సీట్లు సంపాదించిన ఈ పార్టీ రెండో సారి 151 సీట్లు సంపాదించి టీడీపీపై మన విజయం సాధించింది టిడిపి కేవలం 23 స్థానాలకే సరిపెట్టుకుంది అప్పట్లో తక్కువ ఆ సీట్లు రావడం ఏంటి? ఇలాంటి టీడీపీ పని అయిపోయినట్లే అని చాలామంది కామెంట్ చేశారు. ఈసారి కూడా జగన్ పార్టీ అదే రేంజ్ లో చేసుకుంటుందని చాలామంది అంచనా వేశారు కానీ అది రివర్స్ అయ్యింది. వైసీపీ జస్ట్ 11 సీట్లకే పరిమితం అయ్యింది ఇది ఘోర పరాజయం అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బహుశా ఏ సీఎం కూడా ఇంత అవమానకరమైన ఓటమిని చవిచూసి ఉండరు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పతనం కావడం నిజంగా అవమానకరం.
అయితే సీట్లు ఇంత తగ్గినా జగన్ కి మాత్రం ఓటు పర్సంటేజ్ 40% వచ్చింది. ఈ ఓట్ల శాతాన్ని చూసి వైసీపీ సంతృప్తి పడుతోంది. టీడీపీ మాత్రం అంత శాతం ఓట్లు రావడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఇటీవల అయ్యన్నపాత్రుడితో ఒక నేత మాట్లాడుతూ దీని గురించి అసహనం వ్యక్తం చేశాడు. "జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు.. చచ్చేవరకు కొట్టాలి" అంటూ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు సీక్రెట్ మీటింగ్ లో చర్చ జరగక దానికి సంబంధించిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. దీన్ని బట్టి జగన్ కి ఏం ప్రజాబలం ఇంకా ఉంది అనే నిజాన్ని టీడీపీ నేతలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. ఏది ఏమైనా జగన్ మళ్ళీ పుంజుకుని వీరిని ఓడించే ప్రమాదం లేకపోలేదు అని టీడీపీ నేతలు భయపడుతున్నట్లుగా తెలుస్తోంది. "జగన్ చాలా మొండోడు, జగమొండోడు ఇప్పటికీ చాలా ఏళ్లుగా ప్రతిపక్షంలో గడిపాడు, అయినా గెలిచాడు, సో ఆయన మళ్లీ సీఎం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని" చాలామంది మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి ఏం జగన్ ఏ రేంజ్ లో కమ్ బ్యాక్ ఇస్తారో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: