ఒక్క ఇన్నింగ్స్ తో.. 3 రికార్డులు బద్దలు కొట్టిన రోహిత్?

praveen
ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లో ఎక్కడ చూసినా కూడా ఒకే విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అదే ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడిన వీరోచితమైన ఇన్నింగ్స్  గురించి. ఈ వరల్డ్ కప్ టోర్నీలో పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు రోహిత్ శర్మ. దీంతో అతని ఫామ్ చూసి అభిమానులు కాస్త ఆందోళన చెందారు. ఓపెనర్ గా బరిలోకి  దిగుతూ ఇక కాస్త దూకుడుగానే ఆడినప్పటికీ ఎందుకో భారీ స్కోరు చేయడంలో మాత్రం రోహిత్ శర్మ విఫలమయ్యాడు అని చెప్పాలి.

 దీంతో టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలవాలి అంటే రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ ఫామ్ లోకి రావడం ఎంతో ముఖ్యం అని అభిమానులు అందరూ కూడా భావించారు. అయితే ఇక కీలకమైన మ్యాచ్ లో మాత్రం రోహిత్ శర్మ తన బ్యాటింగ్ సత్తా ఏంటో చూపించారు. ఆస్ట్రేలియా తో జరిగిన పోరులో ఏకంగా 92 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ లో 8 సిక్సర్లు ఏడు ఫోర్లు  ఉన్నాయి అని చెప్పాలి. ఒకరకంగా ఆస్ట్రేలియా బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించాడు రోహిత్ శర్మ. ఇక ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా కూడా ఘన విజయాన్ని సాధించింది.

 అయితే ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 92 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ ఓకే ఇన్నింగ్స్ తో ఏకంగా ఒకేరోజు మూడు రికార్డులను బ్రేక్ చేశాడు. ఆస్ట్రేలియా పై ఊచకోతతో అంతర్జాతీయ టి20 లలో అత్యధిక పరుగులు 4165 చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో బాబర్ 4,145, కోహ్లీ 4,13 పరుగులతో ఉన్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ప్రత్యర్తిపై అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్గా కూడా నిలిచాడు రోహిత్. ఆస్ట్రేలియాపై 132 సిక్సర్లు కొట్టాడు. మరోవైపు అంతర్జాతీయ టి20 క్రికెట్ లో 200 సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు.  ఇలా ఒక్క ఇన్నింగ్స్ తో ఏకంగా మూడు రికార్డులను బద్దలు కొట్టేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: