తెలంగాణ: కొడుకు హిమాన్ష్ దెబ్బకి కేటీఆర్ జైలుకేనా..?

Pandrala Sravanthi
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం  కేసీఆర్ ఎన్నో తిప్పలు పడ్డారు .  చివరికి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి ఈ రాష్ట్రాన్ని 9 ఏళ్ల పాటు ఏకధాటిగా పాలించినటువంటి ధీరుడు. అలాంటిదీరుడికి  ప్రస్తుతం దీనస్థితి ఏర్పడింది. దీనికి కారణం కూడా ఆయనే అని చెప్పుకోవచ్చు. అధికారం వచ్చింది కదా అని అహంకారం చూపించడం మొదలుపెట్టారు. చివరికి ఆహంకారమే అధికారాన్ని దూరమయ్యేలా చేసిందని చెప్పవచ్చు. అలాంటి కేసీఆర్  మొన్నటి 2023 ఎలక్షన్స్ లో  తీవ్రమైన పరాభవాన్ని పొందారు. చివరికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయినా తగ్గని కేసీఆర్ పార్లమెంటు ఎలక్షన్స్ లో సత్తా చాటుదామని పూర్తిగా బొక్క బోర్లా పడ్డారు. చివరికి ఒక్క సీటు కూడా సాధించలేక మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు అయింది. 

ఇక ఎప్పుడైతే పూర్తిస్థాయిలో రాజ్యాధికారం కోల్పోయారో అప్పటినుంచి కేసీఆర్ కు చిక్కులు వస్తున్నాయి. ఆయన చేసినటువంటి ఒక్కొక్క అవినీతి బాగోతాన్ని బయటపెడుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఇక జైలుకు వెళ్తారని ఆరోపణలు వస్తున్న తరుణంలో కేటీఆర్ కూడా జైలు తప్పదని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం కూడా తన కొడుకు హిమాన్షు అని అంటున్నారు. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. ప్రస్తుతం సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ కు అఫీడవిట్ చిక్కులు వచ్చాయని చెప్పవచ్చు. ఆయన ఎన్నికల సమయంలో అవిటవిట్లో చూపించిన ఆస్తులన్నీ అబద్దాలని హైకోర్టులో కేసు నమోదు చేశారు. నాలుగు వారాల్లో కౌంటర్ అఫిడవిట్   దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు పంపింది. రిటర్నింగ్ అధికారికి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే తన కొడుకు హిమాన్షు పేరుతో ఆస్తులు కూడబెట్టినట్టు ఈ ఆరోపణలు ఉన్నాయి. కేటీఆర్ పున్న ఫామ్హౌస్ కొడుకు పేరు మీదే ఉందట. అలాగే ఆయన పేరు మీద అయితే దేశాల్లో కూడా ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది.

 ఎన్నికల టైంలో కొడుకు హిమాన్షు తనపై ఆధారపడి లేడని కేటీఆర్ తెలిపారు. దీన్ని హైలెట్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి, లెగిసెట్టి శ్రీనివాస్ అనే మరో వ్యక్తి విడివిడిగా  వేసిన పిటిషన్లను హైకోర్టు జడ్జి  విచారణ చేపట్టారు. ఈ తరుణంలో హిమాన్షుపై ఉన్న ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని, తనపై భార్య మరియు మైనర్ కుమార్తె మాత్రమే ఆధారపడి ఉన్నారని తెలియజేశారు. అయితే గత సంవత్సరం జూలైలో మేజర్ అయిన హిమాన్షు తనపై ఆధారపడి లేరని కేటీఆర్ తెలపడం అనుమానాలకు దారితీసింది. ఈయనకు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో  వెంకటాపూర్ లో నాలుగెకరాలు, ఎర్రవల్లిలో32.15 ఎకరాలు కొనుగోలు చేసినందుకు హిమాన్షు 10.5 లక్షలు., 88.15 లక్షలు చెల్లించారు. గత ఏడాదే మేజర్ అయిన  హిమాన్షు ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారని కేటీఆర్ ఆర్థిక సాయం చేయకుండానే ఇదంతా సాధ్యమైందా అంటూ పిటిషనర్లు ప్రశ్నించారు.  అప్పుడే అఫిడవిట్ లో నిజాలు దాచిపెట్టిన కేటీఆర్ ను కోర్టు వివరణ కోరింది. ఒకవేళ కేటీఆర్ ఆధారాలు చూపించకుంటే మాత్రం తప్పక జైలుకు వెళ్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: