టీడీపీ.. జనసేన స్పెషల్ టార్గెట్ లిస్ట్ లో ఆ యువ నేత..?

Pulgam Srinivas
గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ అధికారంలో ఉంటే టిడిపి పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అలాగే జనసేన ఎక్కువ స్థానాలలో గెలవకపోయినా పవన్ కళ్యాణ్ ఐదు సంవత్సరాలు భారీ ఎత్తున జనాల్లో ఉండడంతో ఈ పార్టీకి కూడా గత ఐదేళ్లలో మంచి గుర్తింపు వచ్చింది. అలాంటి సమయంలో ఎంతోమంది వైసిపి నాయకులు టిడిపి, జనసేన అధినేతలను, కార్యకర్తలను, నేతలను ఎన్నో మాటలు అన్నారు. టిడిపి, జనసేన నాయకులు కూడా వారిని ఎన్నో మాటలు అన్న సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఇంతకాలం వారికి పవర్ లేదు. ఇప్పుడు వారికి పవర్ వచ్చింది.

దానితో మొదటి నుండి కూడా ఒక వేళ టిడిపి, జనసేన మంచి స్థానంలోకి వచ్చినట్లు అయితే వైసీపీ లోని కొంత మంది నాయకులను స్పెషల్ టార్గెట్ చేస్తారు అనే వాదనలో అనేక మంది వినిపిస్తూ ఉన్నారు. ఇకపోతే అలా టిడిపి  జనసేన స్పెషల్ టార్గెట్ లిస్టులో వై సి పి పార్టీలో కీలక నేత అయినటువంటి మార్గాని భరత్ రామ్ కూడా నిలిచే అవకాశాలు ఉన్నాయి. భరత్ చిన్న తనం లోనే యూత్ లీడర్‌గా మారారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థి మాగంటి రూపపై 1,21,634 ఓట్ల మెజారిటీతో ఎంపీ అయ్యారు.

ఆయన 5 జూన్ 2019 న ysr కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత నుండి ఈయన తమ ఆపోజిట్ పార్టీలు అయినటువంటి టిడిపి, జనసేన పై ఎన్నో సార్లు తనదైన రీతిలో విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఈ సారి ఎన్నికలలో టిడిపి, జనసేన, బిజెపి పొత్తులో భాగంగా పోటీ చేసి భారీ సీట్లను దక్కించుకుంది. దానితో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగా, పవన్ ఉప ముఖ్యమంత్రి తో పాటు అనేక శాఖలకు మంత్రిగా నియమితులయ్యారు. ఇక వీరికి ప్రస్తుతం ఫుల్ పవర్ ఉంది. దానితో విరు కూడా భరత్ రామ్ ను స్పెషల్ టార్గెట్ చేసే అవకాశం ఉంది అని చాలామంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

mbr

సంబంధిత వార్తలు: