ఏపీ స్పీకర్ పదవికి భారీగా పోటీ...ఫైనల్ చేసిన బాబు ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఇటీవల ఏర్పడింది. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా... డిప్యూటీ ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. అటు 24 మంత్రులకు... శాఖలు కూడా కేటాయించారు చంద్రబాబు నాయుడు. ఇక ఇప్పుడు అందరి   చూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త స్పీకర్ ఎవరు అనే దాని పైన ఉంది.

 
అయితే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్గా... పనిచేసేందుకు  ఎమ్మెల్యేలు భయపడుతున్నారట. గతంలో స్పీకర్ గా పనిచేసిన కోడల శివప్రసాద్... ఎన్నికల్లో ఓటమి చెందడమే కాకుండా... ఆయన కొన్ని కారణాల వల్ల మరణించారు. ఆ తర్వాత వైసిపి అధికారంలోకి వచ్చినప్పుడు....  తమ్మినేని సీతారాం కు ఏపీ స్పీకర్ బాధ్యతలు అప్పగించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అయితే ఆ పదవి చేపట్టిన తర్వాత తమ్మినేని సీతారాం మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు.

 
దీంతో స్పీకర్ పదవి చేపట్టేందుకు భయపడుతున్నారు ఎమ్మెల్యేలు. కానీ... చంద్రబాబు మాత్రం అయ్యన్నపాత్రుడికి...  ప్రొటెమ్ స్పీకర్ ఆ తర్వాత స్పీకర్ బాధ్యతలు కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. రఘురామకృష్ణరాజు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర, అయ్యన్నపాత్రుడు ఈ నలుగురిలో ఒకరిని స్పీకర్ చేస్తారని మొదటి నుంచి ప్రచారం జరిగింది. అయితే ఫైనల్ గా అయ్యన్నపాత్రుడికి ఈ పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారట చంద్రబాబు నాయుడు.


ఇక అటు దూళిపాళ్ల నరేంద్రకు.... ప్రభుత్వ విప్ పదవి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం దూళిపాళ్ల నరేంద్రకు ఉంది. అటు జగన్మోహన్ రెడ్డి పాలనలో.... ధూళిపాళ్ల నరేంద్ర అలాగే అయ్యన్నపాత్రుడు చాలా పోరాటం చేశారు. పార్టీని కాపాడుకున్నారు. అందుకే అయ్యన్నపాత్రుడు కి స్పీకర్ పదవి, ధూళిపల్లా నరేంద్రకు   ప్రభుత్వ విప్ పదవి ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇక రఘురామకృష్ణరాజు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి భవిష్యత్తులో పదవులు వచ్చే ఛాన్సు ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: