ఏపీ: నాదెండ్ల మనోహర్.. ఉంచేస్తారా ..తీసేస్తారా..?

Divya
కూటమిలో భాగంగా జనసేన పార్టీకి సంబంధించి చాలా మంది నేతలకు పలు కీలకమైన శాఖలు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి గా జనసేన పార్టీకి సంబంధించి నాదెండ్ల మనోహర్ కి ఒక అవకాశం దక్కింది. ఒకప్పుడు స్పీకర్ మంత్రి అవ్వాలని ప్రయత్నించిన స్పీకర్ దగ్గర ఆగిపోయారు. ఇప్పుడు ఆయన కీలకమైన మంత్రిగా మంత్రివర్గంలో చేరారు. పౌర సరఫరాల నేతగా ఆయనకు బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఆయన ముందు ఉన్నటువంటి కీలకమైన అంశం ఏమిటంటే.. రేషన్ గతంలో షాప్ దగ్గరికి వెళ్లి తీసుకునేవారు..

రేషన్ డీలర్ల దగ్గరకు వెళ్లి తీసుకొనే వారు ప్రజలు.. అయితే వైసిపి ఓటమికి రేషన్ డీలర్లు కూడా ఒక కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే డీలర్లకు ప్రత్యామ్నాయంగా వెహికల్ వ్యవస్థను తీసుకువచ్చారు. డీలర్ల దగ్గర స్టాక్ పాయింట్ ఉన్నప్పటికీ సప్లై అంతా కూడా రేషన్ వాహనాల ద్వారానే ప్రజల ఇంటి దగ్గరకు వెళ్ళేది. దీంతో డీలర్లు తినే అవకాశం లేకుండా పోయింది. గతంలో రేషన్ డీలర్లు సైతం చాలా అవకతవకలు కూడా చేసేవారు. వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటివి ఏవి జరిగేందుకు అవకాశం లేదు. దీంతో ఇదే డీలర్లు సైతం జగన్ మీద ఆగ్రహానికి గురయ్యాలా చేసింది.

ఇప్పటికీ కూడా అదే ఒత్తిడి టిడిపి అనుకూల నేతలలో ఉన్నది. ఇప్పుడు వచ్చేసరికి రేషన్ ఇంటి దగ్గరికి వచ్చే అలవాటుగా మారిపోయింది. వాలంటరీ సిస్టం ద్వారా కూడా చెప్పేవారు. ఇప్పుడు ఆ రేషన్ ఇళ్ల దగ్గరికి కాకుండా మళ్లీ రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్లి తీసుకోమంటారా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఈ వాహనాలు చూస్తే ఖచ్చితంగా జగన్ పేరు గుర్తుకొస్తుంది. వాటి మీద స్టిక్కర్లు వేసిన ఏం వేసిన కూడా కచ్చితంగా జగన్ గుర్తుకొస్తారు. కాబట్టి ఈ వాహనాలను ఆపేస్తారా కొనసాగుతారా అనే నాదెండ్ల మనోహర్ కు సవాల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: