భారత అమ్ముల పొదిలో సూసైడ్ డ్రోన్స్.. ఇక శత్రువులకు చుక్కలే?

praveen
భారత రక్షణ రంగాన్ని మరింత పట్టిష్టవంతంగా మార్చడమే లక్ష్యంగా ప్రస్తుతం కేంద్రంలో మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మన పెన్నడు లేని విధంగా ఇలా రక్షణ రంగానికి బడ్జెట్లో భారీ మొత్తంలోనే నిధులు కేటాయిస్తుంది. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి ఏకంగా అత్యాధునిక ఆయుధాలు భారత అమ్ములపుదిలో వచ్చి చేరుతున్నాయి. ఇప్పటికే లక్షల కోట్ల రూపాయలతో అటు రఫెల్ యుద్ధ విమానాలను భారత అమ్ముల పొదిలో చేర్చుకుంది కేంద్ర ప్రభుత్వం.

 అదే సమయంలో సరిహద్దుల్లో శత్రువులను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడమే లక్ష్యంగా.. ఇక మరింత అధునాతనమైన ఆయుధాలను కూడా కొనుగోలు చేస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు భారత ఆర్మీ అమ్ముల పొదిలోకి మరో సరికొత్త ఆయుదం వచ్చి చేరింది అనేది తెలుస్తుంది. ఏకంగా దేశీయంగా తయారైన సూసైడ్ డ్రోన్స్ భారత అమ్ములపదిలో చేరిపోయాయట. శత్రుస్తావురాలను గుర్తించి ద్వంసం  చేయడంలో ఈ సూసైడ్ డ్రోన్స్ ఎంతో కీలక పాత్ర వహిస్తూ ఉంటాయట. ఇతర దేశాల నుంచి ఈ ఆయుధాలను దిగుమతి చేసుకోకుండా పూర్తిస్థాయి దేశీయ టెక్నాలజీతోనే రూపొందించినట్లు తెలుస్తోంది.

 ఈ క్రమం లోనే దేశ వ్యాప్తంగా కూడా సరిహద్దుల్లో ప్రస్తుతం ఈ సూసైడ్ డ్రోన్స్ సైనికులకు అందరికీ కూడా అందుబాటు లోకి వచ్చాయట. నాగాస్త్ర వన్ గా పిలుచుకునే ఈ సూసైడ్ డ్రోన్స్ సరిహద్దు వెంబడి శత్రు స్తావురాలను, లాంచ్ ప్యాడ్స్ సహా చొరబాటు దారులపై ఎంతో కచ్చితత్వంతో దాడులు చేయగలవట. విపరీతమైన ఊష్ణోగ్రతలు ఎత్తైన ప్రదేశాల్లోనూ ఈ డ్రోన్స్ ఉపయోగించవచ్చు అన్నది తెలుస్తోంది. ఎకనామిక్ ఎక్స్ప్లోసివ్స్ లిమిటెడ్ రూపొందించిన ఈ సూసైడ్ డ్రోన్స్ గరిష్ట రేంజ్ ఏకంగా 30 కిలోమీటర్ల వరకు ఉంటుంది అన్నది తెలుస్తుంది. అయితే ఈ సరికొత్త ఆయుధం రాకతో భారత ఆర్మీ మరింత పటిష్టంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: