అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య పెద్ద గొడవ.. అందుకే దూరం?

Suma Kallamadi
టీడీపీ కూటమి అఖండ విజయం తర్వాత నందమూరి ఫ్యామిలీ సెలబ్రేషన్స్ మూడ్‌లోకి వెళ్ళిపోయింది కానీ మెగా ఫ్యామిలీ విషయంలో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. అసలు మెగా ఫ్యామిలీలో కూడా సంబరాలు సంబరాలు అంటారు. ఎందుకంటే వారి ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఘన విజయం సాధించారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం కూడా అయ్యారు ఈ విజయం మామూలుది కాదు కాబట్టి మెగా ఫ్యామిలీ అంతటా సెలబ్రేషన్ వైబ్స్ కనిపించాలి కానీ అలా జరగడం లేదు.
 దీనికి ప్రధాన కారణం మెగా కాంపౌండ్ నుంచి అల్లు ఫ్యామిలీ దూరంగా వెళ్లిపోవడమేనని తెలుస్తోంది. సాధారణంగా మనం మెగా ఫ్యామిలీ అంటే అల్లు, కొణిదెల రెండు కుటుంబాలను రిఫర్ చేస్తాం కానీ ఇప్పుడు ఈ మెగా కాంపౌండ్ కి అల్లు ఫ్యామిలీ దూరమైపోయిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు మెగా ఫ్యామిలీలోని పెద్దలందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు కానీ అల్లు అరవింద్, అల్లు అర్జున్ లేదా అల్లు శిరీష్, వీరి ముగ్గురిలో ఎవరూ కూడా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కనిపించలేదు.
ఈ ప్రమాణ స్వీకార ఉత్సవానికి సంబంధించిన ఫోటోలు చాలా వైరల్ అయ్యాయి. వాటిలో ఏ ఒక్క దానిలో కూడా అల్లు ఫ్యామిలీ వాళ్లు కనిపించకపోవడం గమనార్హం. ఎన్నికల ప్రచార సమయంలో బన్నీ వైసీపీ నేతకు సపోర్ట్ చేశారు కానీ పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేయలేదు. ఆ సమయంలో నాగబాబు తమకు సపోర్ట్ చేయకపోతే తమ వాడైనా పరాయి వాడే అని ఒక ట్వీట్ చేశారు తర్వాత డిలీట్ చేశారు. దీని తర్వాత అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య ఎలాంటి గొడవలు జరిగాయో తెలియ రాలేదు. "పవన్ ప్రమాణ స్వీకారాన్ని అల్లు ఫ్యామిలీ చూసేందుకు రాలేదు, దీన్ని బట్టి చూస్తుంటే వారి మధ్య ఏదో పెద్ద గొడవే జరిగి ఉంటుందని అర్థమవుతుంది." అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ఊహగానాలే నిజమా? లేదంటే వారంతా కలిసే ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: