టీడీపీ: అయ్యన్నకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదంటే?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు, మంత్రి మండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమాలు పూర్తయిన సంగతి తెలిసిందే. మంత్రులు ఖరారు అయిపోయారు. అయితే కొంతమంది సీనియర్లకు మాత్రం మంత్రి పదవులు దక్కలేదు. వారిలో సీనియర్ నేత ఉమ్మడి విశాఖ జిల్లాలోని నర్సీపట్నం ఎమ్మెల్యే అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు ఒకరు. ప్రస్తుతం టీడీపీలో చంద్రబాబు తరువాత ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేత. ఆయనకి మంత్రి పదవి ఇవ్వకపోవడం పై టీడీపీ అభిమానుల్లో చర్చ నడిచింది. అయితే అదే ఉమ్మడి విశాఖలో వంగళపూడి అనితకి మంత్రి పదవి దక్కింది. ఇక సమాకాలీకుడు అయ్యన్నపాత్రుడికి మంత్రి పదవి ఎందుకు దక్కలేదంటే దానికి కారణం ఆయన కుమారుడు. ఆయన కుమారుడు చింతకాయల రవి అనకాపల్లి ఎంపీ సీటుని ఆశించారు. అయ్యన్నపాత్రుడు తన కొడుకుకి ఆ ఎంపీ సీటు కావాలని చంద్రబాబుని పట్టు బట్టాడు.బాగా ఒత్తిడి చేశాడు.


అయితే బీజేపీతో పొత్తు కారణంగా అది అవ్వలేదు. పైగా ఒకే ఫ్యామిలి నుంచి ఇద్దరు ముగ్గురు కి సీటు ఇవ్వడం కుదరదని చంద్రబాబు అన్నారు. అయితే రానున్న రోజుల్లో చింతకాయల రవికి రాజ్య సభ సీటు ఇప్పిస్తా అని చంద్రబాబు అయ్యన్న పాత్రుడికి హామీ ఇచ్చారు. కాబట్టి రవికి రాజ్య సభ సీటు ఇస్తున్నాడు కాబట్టి అయ్యన్నపాత్రుడికి మంత్రి పదవి ఇవ్వలేదని తెలిసింది. అయితే సీనియర్ నాయకుడు కాబట్టి స్పీకర్ బాధ్యత ఇవ్వనున్నట్లు సమాచారం తెలుస్తుంది.ఇక చంద్రబాబు నాయుడు తర్వాత అయ్యన్న పాత్రుడు, బుచ్చయ్య చౌదరి అత్యధిక సార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అయ్యన్నపాత్రుడు 1983, 85, 94, 99, 2004, 14 ఇంకా 24 సంవత్సరాలలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక బుచ్చయ్య చౌదరి 1983, 85, 94, 99, 2014, 19, 24 సంవత్సరాలలో గెలుపొందారు. అయితే వీరిద్దరిలో ప్రొటెం స్పీకర్‌ అవకాశం ఎవరిని వరించనుందో అన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: