ఓటమిపై మాజీ సీఎం జగన్ సెన్సేషనల్ కామెంట్స్?

Purushottham Vinay
వైసీపీ ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎమ్మెల్సీలు ప్రలోభాలకు లొంగొద్దు అని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మనపై ఎలాంటి కేసులు పెట్టిన కూడా ఏమాత్రం బయపడొద్దని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.ఈ ఎన్నికలలో మనం ఓడిపోయినా కానీ 40 శాతం ప్రజలు మనవైపే ఉన్నారని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మనం చేసిన మంచి పనులు ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలు శకుని పాచికల లాగా ఉన్నాయని అన్నారు. ఈవీఎంలపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని అన్నారు. బీజేపీ, జనసేన ఇంకా టీడీపీ హామిమున్ నడుస్తోందని కూడా జగన్ చురకలు అంటించారు. వారికి మరికొంత సమయం ఇద్దామని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.


ఆ తరువాత ప్రజల తరఫున పోరాటం చేద్దామని కూడా జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. వారు ఖచ్చితంగా అసెంబ్లీలో మన నోరును కట్టడి చేసే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి మండలిలో గట్టిగా పోరాడుదాం అని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.ఈ 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా దారుణాతి దారుణంగా పరాజయం చవి చూసిన జగన్ మోహన్ రెడ్డి పార్టీ పునర్‌నిర్మాణంపై బాగా దృష్టి పెట్టారు. ప్రతి రోజూ కూడా ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో జగన్ మోహన్ రెడ్డి భేటీ అవుతున్నారు. ఈరోజు వైసీపీ ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం అయ్యారు. మొత్తం 48మంది ఎమ్మెల్సీలతో జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్సీలు చేజారి పోకుండా నిలుపుకునే వ్యూహంని జగన్ రచిస్తున్నారు. ఈ శాసనమండలిలో అత్యధికంగా వైసీపీ ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రభుత్వ బిల్లుల విషయంలో కూడా వైసీపీ ఎమ్మెల్సీలు కీలకం కానున్నారు. త్వరలో జగన్ మోహన్ ఓదార్పు యాత్ర చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: