మొదటి దెబ్బతోనే చంద్రబాబు క్యాబినెట్ లో ఛాన్స్ కొట్టేసిన సత్యకుమర్..!

Pulgam Srinivas
ఈ సారి జరిగిన ఎన్నికలలో తెలుగు దేశం , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీలోకి దిగాయి. ఈ ఎన్నికలలో కూటమికి అద్భుతమైన విజయం దక్కింది. అందులో భాగంగా బిజెపి కి పది అసెంబ్లీ స్థానాలను ఇవ్వగా , అందులో ఎనిమిది స్థానాలలో బిజెపి పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. దానితో బిజెపి పార్టీ నుండి ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయా అని ఈ పార్టీ శ్రేణులు , జనాలు అంత ఆసక్తిగా ఎదురు చూశారు.

ఇక నిన్న చంద్రబాబు నాయుడు ఎంతో మంది రాజకీయ సినీ ప్రముఖుల మధ్య ముఖ్య మంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారం వేదికపైనే పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో భాగంగా బిజెపి పార్టీ అభ్యర్థి అయినటువంటి సత్య కుమార్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. బీసీ , యాదవ సామాజిక వర్గానికి చెందిన సత్య కుమార్ ధర్మవరం నియోజక వర్గం నుండి పోటీ చేశారు.

ఈయన మొట్ట మొదటి సారి ఎమ్మెల్యే గా పోటీ చేసి మొదటి ప్రయత్నం లోనే విజయం సాధించాడు. ఇక ఈయనకు బిజెపి పార్టీలో మంచి స్థానం ఉండడంతో మొదటి సారి ఈయన గెలిచిన కానీ ఈయన కు మంత్రి పదవి దక్కింది. సత్య కుమార్ భారత మాజీ ఉప రాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు దగ్గర కొంత కాలం వ్యక్తిగత కార్యదర్శి గా పని చేశారు.

2018 వ సంవత్సరం సత్య కుమార్ బిజెపి పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇలా వెంకయ్య నాయుడు దగ్గర కొంత కాలం పని చేయడం , అలాగే బిజెపి పార్టీ పెద్దలతో ఈయనకు మంచి సంబంధాలు ఉండడంతో బిజెపి పార్టీ పెద్ద నేతలు ఈయన పేరును సూచించినట్లు దానితో చంద్రబాబు క్యాబినెట్ లో ఈయనకు మొదటి సారి గెలిచినా కూడా అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: