చంద్ర బాబు: ఈరోజే తొలి సంతకం.. వాటి మీదే..!

Divya
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ బాధ్యతలను తీసుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం సచివాలయానికి వెళ్లి నాలుగు గంటల 41 నిమిషాలకు సీఎం చాంబర్ లో బాధ్యతలను సైతం తీసుకోబోతున్నారు.చంద్రబాబు మొదటి సంతకం దేని పైన అనే విషయం పైన ఇప్పుడు అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అందరూ అనుకున్నట్టుగానే మెగా డీఎస్సీ ఫైల్ పైన చంద్ర బాబు మొదటి సంతకం చేయబోతున్నారని తెలుస్తోంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన కూడా రెండవ సంతకం.. మూడవ సంతకం సామాజిక పెన్షన్ది 4వేలకు పెంపు.. చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సచివాలయానికి వెళ్ళేందుకు రెండు మూడు రోజులు సమయం పడుతుందని భావించినప్పటికీ .. ఈ రోజున మంచి రోజు కావడం చేత 4:41 నిమిషాలకు చంద్రబాబు సచివాలయం చాంబర్ కు వెళ్ళబోతున్నారని తెలిసి.. అక్కడ ఉద్యోగ సంఘాలు రాజధాని రైతుల చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే ఎమ్మెల్యేలను కూడా కలవబోతున్నారట గత పాలకులు ఐదేళ్ల కాలంలో అమరావతిని పూర్తిగా వదిలేశారని ఇప్పుడు టిడిపి అధికారంలోకి రావడంతో రాజధాని రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

చంద్రబాబు ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని అమరావతి రైతులు తమకు పూర్వ వైభవం వస్తుందని విధంగా ఎదురుచూస్తున్నారు.. అలాగే మెగా డీఎస్సీ పైన మొదటి సంతకం చేస్తారని చంద్రబాబు హామీ ఇచ్చారు. టిడిపి విజయానికి సహాయపడిన నాలుగు అంశాల పైన ఉన్నవాటిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పై రెండవ సంతకం.. అన్న క్యాంటీన్లను మూడవ సంతకం పెన్షన్ ని నాలుగు వేలకు పెంపు నాలుగవ సంతకం అలాగే స్కిల్ సెక్షన్స్ ప్రక్రియను కూడా చేపట్టడం వంటి వాటిపైన ఈ రోజు సంతకం పెట్టే ఎలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే తాను ఎన్నికలలో హామీలు ఇచ్చారో వాటిని కూడా అమలు చేసేలా చంద్రబాబు ముందుకు వెళ్లబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: