చంద్రబాబు మంత్రివర్గంలో అతి తక్కువ, అతి ఎక్కువ వయసు ఉన్న వారెవరో తెలుసా..??

Suma Kallamadi
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు మంత్రివర్గం కొలువుదీరింది. జూన్ 12న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కి నాలుగో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. పవన్ అన్నయ్య చిరంజీవి కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్న దృశ్యాలైతే చాలామంది కంట నీళ్లు తెప్పించాయి. ఈ కార్యక్రమానికి మోదీతో సహా చాలామంది బీజేపీ పెద్దలు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆన్‌లైన్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ రావడం విశేషం.
ఈరోజు చంద్రబాబుతో పాటు మరో 24 మంది నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే చంద్రబాబు కేబినెట్‌లో ఎవరు అత్యంత చిన్న వయసు కలిగి ఉన్నారు? ఎవరు అత్యంత ఎక్కువ వయసు కలిగి ఉన్నారో తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే మొన్న రామ్మోహన్ 36 ఏళ్లకే కేంద్రమంత్రి అయి రికార్డు సృష్టించారు. అలా ఏపీలో కూడా తక్కువ వయసు ఉన్నవారు మంత్రి అయ్యారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. మరి ఆ వివరాలు మనమూ తెలుసుకుందామా..
అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చంద్రబాబు కొత్త కేబినెట్‌లో అతి చిన్న వయసు ఉన్న మంత్రి వంగలపూడి అనిత. ఆమె వయసు ప్రస్తుతం 40 ఏళ్లు. 2024 ఎన్నికల్లో ఆమె పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి 43,727 ఓట్ల మార్జిన్‌తో ఘన విజయం సాధించారు. ఆమె ఈరోజు మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనిత వృత్తి రీత్యా స్కూల్ టీచర్, ఉమ్మడి విశాఖ జిల్లా రాజవరంలో టీచర్‌గా వర్క్ చేస్తూనే పాలిటిక్స్ వైపు అడుగులు వేశారు. 2014 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.
2018లో టీటీడీ బోర్డులో ఒక మెంబర్ అయ్యారు. 2019 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి పోటీ చేశారు కానీ వైసీపీకి వచ్చిన వేవ్ కారణంగా ఓడిపోయారు. అయినా 2024లో టీడీపీ టికెట్టు గెలుచుకోగలిగారు, కాకపోతే ఈసారి 2014లోలాగానే పాయకరావుపేట నుంచి బరిలోకి దిగారు. మంచి మెజారిటీతో విజయం సాధించారు.
ఇక చంద్రబాబు కేబినెట్‌లో ఎక్కువ వయసున్న వారి విషయానికి వస్తే.. 70 ఏళ్లు దాటినవారు ఏకంగా ముగ్గురు నేతలు ఉన్నారు. 50 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న వారు 15 మంది, 40 - 50 ఏళ్ల మధ్య వయసు గలవారు నలుగురు ఉన్నారు. ఏపీ కేబినెట్ లో అత్యంత ఎక్కువ వయసు ఉన్న వారు మరెవరో కాదు ఎండీ ఫరూక్ ఆయనకు ప్రస్తుతం 75 ఏళ్లు. అయిన తర్వాత ఎక్కువ వయసు ఉన్నవారు చంద్రబాబు, ఈ నేత వయసు ప్రస్తుతం 74 ఏళ్లు. ఇక ఆనం రాం నారాయణరెడ్డి 71 ఏళ్ల వయసులో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, మినిస్టర్ గా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: