బీజేపీని ఇరకాటంలోకి లాగిన వైసీపీ..??

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 164 సీట్లు గెలుచుకొని ఇంటికి కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల లెక్కింపు ముగియగానే రాష్ట్రంలో టిడిపి జనసేన నేతల అరాచకాలు పెరిగిపోయాయి వైసీపీ కార్యకర్తలపై వీళ్లు దాడులు చేస్తున్నారు వాళ్ళ ఇల్లు సామాన్లు ధ్వంసం చేస్తున్నారు రాష్ట్రంలో కొంత సమయంలోనే 27 మేజర్ క్రిమినల్ కేసెస్ నమోదయ్యాయి. ఇందులో హత్యలు, హత్యా ప్రయత్నాలు వంటివి ఉన్నాయి. ఇంకా లెక్కలేన్నన్ని గొడవలు, దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో వైసీపీ వాళ్లు తమను తాను కాపాడుకోవడానికి చాలానే కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి బీజేపీని ఇరకాటంలోకి లాగారు.
తాజాగా వైసీపీ నేత విజయసాయిరెడ్డి నేషనల్ మీడియాతో మాట్లాడుతూ "ఎన్నికలకు ముందే బీజేపీ, జనసేన, టీడీపీల మధ్య పొత్తు కుదిరింది. ఈ పార్టీలు కూటమిగా గెలిచి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి, కాబట్టి వైసీపీ సభ్యులపై టీడీపీ సభ్యులే అరాచకాలు, దాడులు చేసినా ఆ మూడు పార్టీలూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు నివేదించాం." అని అన్నారు.
బీజేపీ పార్టీ టీడీపీ కూటమిలో భాగస్వామ్యం అయినా, ఏపీలో జరిగే హింసాత్మక సంఘటనలపై నోరు మెదపకపోవడం షాకింగ్ లాగా అనిపిస్తుంది అన్నట్లు విజయ సాయి రెడ్డి మాట్లాడారు. బీజేపీ ప్రతి గొడవ పై మాట్లాడుతుందని కానీ ఏపీ ఘటనల విషయంలో మాత్రం చోద్యం చూడడానికి పరిమితమైందని ఆయన  అసహనాన్ని వ్యక్తం చేశారు. మొత్తం మీద టీడీపీ తప్పులకు బీజేపీ బాధ్యత వహించాలి, టీడీపీ వాళ్ళని బీజేపీ వాళ్లే హద్దుల్లో ఉంచుకోవాలి అన్నట్టు ఈ వైసీపీ నేత మాట్లాడారు. మరి దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఏపీలో బాగానే గొడవలు జరుగుతున్నాయి. వైసీపీ కోసం చాలా బాగా పనిచేసిన వారినే టార్గెట్ గా జనసేన, టీడీపీ వాళ్లు చూస్తున్నారు. ఇకపోతే నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు విజయసాయిరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: