సీబీఎన్ 4.0 వెర్షన్ లో ఆ బగ్స్ ప్రవేశిస్తే ఏంటి పరిస్థితి?

Veldandi Saikiran
సీబీఎన్ 4.0 వెర్షన్ లో ఆ బగ్స్ ప్రవేశిస్తే ఏంటి పరిస్థితి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి  ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండుసార్లు సీఎం గా పనిచేసిన బాబు... సీమాంధ్ర ఏర్పడిన తర్వాత.. రెండవసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే... కూటమి పార్టీలతో జగన్మోహన్ రెడ్డిని ఓడించిన చంద్రబాబు నాయుడుకు... ముందు ముందు పెద్ద పెద్ద సవాళ్లే ఎదురుకానున్నాయి. వైసిపి, బిజెపి, జనసేన అటు షర్మిల పార్టీ నుంచి... ఏ విధంగానైనా...  చంద్రబాబు నాయుడు సమస్యలు ఎదుర్కొనే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది.


అంతెందుకు తెలుగుదేశం పార్టీలో ఉన్న.. మంత్రులు లేదా ఎమ్మెల్యేలు... చంద్రబాబుకు ఇబ్బందులు తెచ్చే ఛాన్స్ ఉంటుంది. కొత్తగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైనా.. చాలా యాక్టివ్ గా పని చేస్తారు. ఏడాది పూర్తి అయిన తర్వాత.... ప్రజలు ప్రభుత్వాన్ని అసలు పట్టించుకోరు. ఎవరి పని వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తారు. అలాంటి సమయంలో... చంద్రబాబు కేబినెట్ లో ఉన్న మంత్రులు గాని... తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ.. స్కాములకు పాల్పడే అవకాశాలు ఉంటాయి.


 చంద్రబాబు నాయుడు చాలా పటిష్టంగా యంత్రాంగాన్ని ఉంచినప్పటికీ కూడా... నాయకులు తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తారు. గత ఐదు సంవత్సరాలలో నష్టపోయిన డబ్బును సంపాదించుకునే దిశగా.. తెలుగు తమ్ముళ్లు ప్రయత్నం చేసే ప్రమాదం ఉంటుంది. అటు వైసిపి పార్టీ 11 సీట్లు గెలుచుకున్నప్పటికీ... వారి ఓటు పర్సంటేజ్  40 శాతం పైగా ఉంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ 40% పైగా ఓట్ పర్సంటేజ్ సంపాదించుకుంది. కాబట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయకపోయినా..  వైసిపి పార్టీ బలంగా ఫైట్ చేసే ఛాన్స్ ఉంటుంది.


అలాగే... అడుగడుగునా...  చంద్రబాబును నిలదీసే ఛాన్స్ జగన్కు ఉంటుంది. అయితే... తెలుగుదేశం కూటమి పార్టీలలో ఉన్న నేతల మధ్య కూడా... ఈ ఐదేళ్లలో ఎలాంటి గొడవలు అయినా జరగవచ్చు. ప్రెస్ మీట్ లో కానీ... సమావేశాలలో కానీ... జనసేన, బిజెపి లేదా తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మనస్పర్ధలు వస్తే... చంద్రబాబు సీటుకే ఎసరు రావడం ఖాయం.  ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యవహారంలో చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏమాత్రం.. పవన్ కళ్యాణ్ కు ప్రాధాన్యత ఇవ్వకపోతే... ఏపీ ప్రజలే తిరగబడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చంద్రబాబు సీఎంగా చాలా పెద్దన్న పాత్ర వహించాల్సి ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: