అదే బిజెపిని ముంచేసింది.. RSS సంచలన వ్యాఖ్యలు?

praveen
బిజెపి పార్టీ మూడోసారి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలోనే  ఇటీవల ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేశారు. మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తయింది. అయితే ఇలా మూడోసారి అధికారం చేజిక్కించుకున్నప్పటికీ.. బీజేపీ మాత్రం ఇంకా షాక్ లోనే ఉంది. ఎందుకంటే ఈసారి తప్పకుండా నాలుగవందల సీట్లలో విజయం సాధిస్తాము అనే పట్టుదలతో ఉంది ఆ పార్టీ. ఎందుకంటే మోడీ చరిష్మాతో ఇది ఎంతో సునాయాసంగా జరిగిపోతుంది అని నమ్మకాన్ని కూడా పెట్టుకుంది.

 ఈ క్రమంలోనే 400 సీట్లు గెలుస్తాము అనే నినాదంతోనే ఎన్నికల్లో బలిలోకి దిగింది. ప్రతి రాష్ట్రంలో కూడా ఇదే నినాదంతో ప్రచారం కూడా నిర్వహించింది  కానీ తీరా చూస్తే బిజెపికి మునుపటితో పోల్చి చూస్తే తక్కువ సీట్లే వచ్చాయి. ఏకంగా కమలం పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో సైతం ఆ పార్టీకి నిరాశే ఎదురైంది. దీంతో ఎక్కడ తప్పు జరిగింది? ఎందుకు ఇంత తక్కువ సీట్లు వచ్చాయి అన్న విషయం ప్రస్తుతం బిజెపిని కాస్త ఆందోళనకు గురిచేస్తుంది. అయితే పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడంతో ఇక బిజెపి  ఎన్డీఏ కూటమిలోని మిగతా పార్టీల మద్దతు తప్పనిసరిగా మారిపోయింది. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది అని చెప్పాలి.

 అయితే ఇటీవలే ముగిసిన పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి పార్టీకి తక్కువ స్థానాలు రావడానికి గల కారణాలు ఏంటి అనే విషయంపై ఆర్ఎస్ఎస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. మితిమీరిన విశ్వాసంతో ఉన్న బీజేపీ నేతలకు ఈ ఎన్నికల ఫలితాలు గుణపాఠం చెప్పాయి అంటూ ఆర్ఎస్ఎస్ తన మ్యాగజైన్ 'ఆర్గనైజర్' లో విమర్శించింది. ఆ పార్టీ కార్యకర్తలు సహా చాలామంది నేతలు మోదీ క్రేజ్ చూసి సంతోషించారు తప్ప.. ప్రజల గొంతుకు వినిపించుకోలేదని చెప్పుకొచ్చింది. తమ వాలంటీర్ల సహాయం తీసుకోకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేసింది. 400 పార్ అని ప్రధాన నరేంద్ర మోడీ ఇచ్చిన నినాదాన్ని కార్యకర్తలు నేతలు సీరియస్ గా తీసుకోలేదు అంటూ ఆరోపించింది ఆర్ఎస్ఎస్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp

సంబంధిత వార్తలు: