తమ్ముడుకి ఆ పదవినే కోరుకుంటున్న చిరంజీవి?

Purushottham Vinay
ఈ 2024 ఆంధ్రప్రదేశ్  సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో మెజారిటీ క్రెడిట్ మాత్రం జనసేనాని పవన్ కళ్యాణ్ కే దక్కుతుందనే మాటలు వినిపిస్తున్నాయి.పైగా పవన్ ను కూడా తుఫాను తో పోల్చారు ప్రధాని మోడీ. ఇక, ఇప్పటికే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన వేళ.. ఈ నెల 12న ఏపీలో కూడా కూటమి ప్రభుత్వం కొలువుదీరనుంది.కూటమిలో భాగంగా కేంద్రంలో ఏకంగా రెండు మంత్రి పదవులను టీడీపీ సాధించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇకపై ఆంధ్రప్రదేశ్ లోని తన కేబినెట్ లో ఎవరెవరికి మంత్రి పదవులు, ఎవరి ఏ పదవి అనే విషయంపై చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా లోకేష్ నిర్ణయాలు కూడా కీలకం కాబోతున్నాయని చెబుతున్నారు. ఆ సంగతి అలా ఉంటే.. పవన్ కళ్యాణ్ పదవిపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది.

ఏపీలో ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయబోతున్న వేళ కేబినెట్ మంత్రులు ఎవరెవరు అనే చర్చ ఇప్పడే గట్టిగా మొదలైంది. ఈ క్రమంలో జనసేన పార్టీకి కనీసం నాలుగు మంత్రి పదవులు అయినా దక్కుతాయని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆ నలుగురి ఎంపికపైనే ఉన్నారని సమాచారం. పవన్ కల్యాణ్ ను ఏ పదవి వరించబోతుందనేది ఇప్పుడు ఆసక్తిగా మరింది.ఈ క్రమంలో జనసేన పార్టీ అధినేత ఇంకా తన తమ్ముడు పవన్ కల్యాణ్ ను డిప్యూటీ సీఎంగా చూడాలని టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి కోరిక అనే చర్చ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. ఎందుకంటే కూటమిని గెలిపించడంలో పవన్ కళ్యాణ్ పడ్డ కష్టం అంతా ఇంత కాదు. తన తమ్ముడు పడిన కష్టానికి, అతనిపై ఒక వర్గం పెట్టుకున్న నమ్మకానికి ఆ మాత్రం హోదా అవసరం అని, అతడు దానికి నూటికి నూరుశాతం అర్హుడని మెగాస్టార్ చిరంజీవి పూర్తిగా విశ్వసిస్తున్నారని ఒక చర్చ నెట్టింట వైరల్ గా మారింది. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పాత మూవీ తమ్ముడు సినిమా ఫ్యాన్స్ కోసం జూన్ 15 వ తేదీన రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా రీ రిలీజ్ రికార్డ్స్ బద్దలు కొడుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: