ఏపీ: జులై 1న వృద్ధుల ఖాతాల్లో నేరుగా ₹7000 జమ..??

Suma Kallamadi
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 164 స్థానాలు కైవసం చేసుకుని ఘనవిజయం సాధించింది. ఈ విజయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు చాలా పెద్ద పాత్ర పోషించాయని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా రూ.4 వేలకు పెన్షన్లు పెంచుతామని చంద్రబాబు ఇచ్చిన ఒక హామీ అవ్వ, తాతలందరినీ టీడీపీకే ఓటు వేసేలా చేసింది.జూలై 1వ తేదీ నుంచే ఈ హామీని నెరవేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పెన్షన్ విషయంలో జగన్ కంటే చంద్రబాబు కాస్త ఎక్కువ హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి రాగానే రూ.1,000 పెన్షన్ పెంచుతామని.. పెంచిన అమౌంటు ఏప్రిల్ నుంచి లెక్క కట్టి ఇస్తామని కూడా అన్నారు. ఆ లెక్కన చూసుకుంటే జులైలో వృద్ధులు, ఒంటరి మహిళలకు రావలసిన 4,000 వస్తాయి. అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి పెరిగిన వెయ్యి వెయ్యి వెయ్యి కలిపి 3000 కూడా వస్తాయి అంటే రూ.7,000 ప్రభుత్వం అందజేస్తుంది.
జులై 1న ఒక్కొక్కరికీ రూ.7000 పెన్షన్ అందుతుందని చాలామంది ఎదురుచూస్తున్నారు. వాటితో అప్పులు తీర్చుకోవడం లేదా వైద్య ఖర్చులకు ఉపయోగించడం చేయాలని చూస్తున్నారు. అయితే ఆ మొత్తం అమౌంట్‌ను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయాలంటే ఇంకొక 20 రోజుల సమయం ఉంది. ఇక ఆగస్టు మంత్ నుంచి హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి నెలా రూ.4,000 పెన్షన్ లభిస్తుంది. కానీ చంద్రబాబుకు ఇక్కడ ఒక సవాలు ఎదురవుతోంది. అదేంటంటే ఏపీ బడ్జెట్ సుమారు 60 లక్షల మందికి రూ.7,000 ఇచ్చే పరిస్థితుల్లో లేదట. అప్పులు తీసుకుందామన్న అవకాశం కూడా లేదంటున్నారు ఎందుకంటే సెప్టెంబర్ వరకూ ఉన్న లోన్ లిమిట్ ను వైసీపీ సర్కార్ ఆల్రెడీ యూజ్ చేసుకుందట.
 ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు చిక్కుకున్నారని అంటున్నారు. భారీ మెజారిటీతో గెలుపొంది ఇచ్చిన కీలకమైన హామీని నెరవేర్చకపోతే చంద్రబాబుకు చాలా చెడ్డ పేరు వస్తుంది. రూ.4000 + రూ.3000 పెన్షన్ ఇస్తానన్న మాటను నిలబెట్టుకోవడానికి ఆయన మోదీ హెల్ప్ తీసుకోవచ్చు. ఒకవేళ భారంగా అనిపిస్తే రూ.4,000 జులై 1న జమ చేసి, మిగిలిన రూ.3,000 వేలను విడతల వారీగా క్రెడిట్ చేయాలనే ఆలోచన చేయవచ్చు. ఏది ఏమైనా ఈ హామీ విషయంలో చంద్రబాబు మాట నిలబెట్టుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: