లోకేష్: అవమానించిన వారికి ఇక చుక్కలే?

Purushottham Vinay
•జీరో నుంచి హీరోగా మారిన లోకేష్ 


•అప్పుడు పప్పు అన్నవాళ్ళే ఇప్పుడు నిప్పు అంటున్నారు


•లోకేష్ ని అవమానించిన వారికి చుక్కలు కనపడటం ఖాయం


మంగళగిరి - ఇండియా హెరాల్డ్ : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు బాబు తనయుడు నారా లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిజానికి పాపం ఏ రాజకీయ నాయకుడు పడని అవమానాలు లోకేష్ పడ్డారు. ఆయన్ని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చాలా ఘోరంగా అవమాన పరిచారు. అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. లోకేష్ కి రాజకీయాలు తెలీవని, మాట్లాడటం చేత కాదని, తడబడతాడని, మినిమమ్ నాలాడ్జ్ లేని రాజకీయ నేత అని, చంద్రబాబు లేకుంటే లోకేష్ ఎందుకు పనికిరాడని, లోకేష్ ఒక పప్పు అని అతన్ని వైసీపీ నేతలు, కార్యకర్తలు, వైసీపీ శ్రేణులు తెగ ట్రోల్ చేశారు. అయితే అందులో అర్ధం ఉంది. నిజంగా ఒకప్పుడు లోకేష్ జీరోనే. పప్పునే. కాబట్టి అతన్ని ట్రోల్ చెయ్యొచ్చు. కానీ పర్సనల్ అటాక్ చేసి అతని ఇంట్లో ఆడవాళ్ళని టార్గెట్ చేశారు. లోకేష్ అమ్మగారిని అవమానించారు. 


ఇన్ని చేసినా కూడా లోకేష్ పడిపోలేదు. పడిపోయి తిరిగి లేచి గట్టిగా నిలబడ్డాడు. తన తప్పులని తెలుసుకొని రాజకీయంలో చాలా విషయాలు నేర్చుకొని నాలెడ్జ్ పెంచుకొని గత 5 ఏళ్లలో బాగా రాడ్డు దేలాడు. ఎంతలా అంటే ఒకప్పుడు లోకేష్ ని జీరో అన్న ట్రోలర్స్ ఇప్పుడు హీరో అనేంతలా.. ఒకప్పుడు పప్పు అన్న ట్రోలర్స్ ఇప్పుడు నిప్పు అనేంతలా లోకేష్ రాడ్డు దేలాడు. ఇప్పుడు కష్టపడి జనాల్లోకి వెళ్లి మంగళ గిరిలో భారీ మెజారిటీతో గెలిచి ట్రోలర్స్ నోళ్లు మూయించాడు. తనని అవమానించిన వారికి గట్టి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు లోకేష్ టైం వచ్చింది. లోకేష్ పార్టీ అధికారంలో ఉంది. పైగా ఇప్పుడు లోకేష్ అంటే బాగా రాడ్డుదేలిన నేత. ఇక నుంచి తనని అవమానించిన వైసీపీ నాయకులకు చుక్కలు చూపించడానికి లోకేష్ రెడీ అయ్యాడు. తన తల్లిని అవమానించిన ఏ ఒక్కరిని కూడా వదిలి పెట్టకూడదని లోకేష్ ఫిక్స్ అయ్యాడు.తెలుస్తున్న సమాచారం ప్రకారం లోకేష్ హోమ్ మంత్రి బాధ్యతలు తీసుకోబోతున్నాడని తెలుస్తుంది. ఇక వైసీపీ పార్టీకి చుక్కలు చూపించడం ఖాయం అంటున్నారు తెలుగు దేశం అభిమానులు. చూడాలి లోకేష్ యాక్షన్ ఎలా ఉండబోతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: