మొదలైన ఎర్ర బుక్కు ఆపరేషన్.. పారిపోతున్న ఐపీఎస్ ఆఫీసర్లు వీరే..??

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ నాయకులు, మద్దతుదారులను వేధించిన మాట వాస్తవమే. అయితే దానికి ప్రతిగా ప్రతీకారం తీర్చుకోవాలని లోకేష్ భావిస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో అవినీతి ఆక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యోచిస్తునట్లు టీడీపీ నాయకుడు నారా లోకేశ్ అన్నారు. ఆయన ఒక ఎర్ర బుక్కు కూడా రాశారు. అందులో అవినీతి కార్యక్రమాలు పాల్పడ్డ వారి పేర్లు పొందుపరిచారు. రెడ్ బుక్ ఆపరేషన్ పేరిట ఇప్పుడు అందులో ఉన్న వారిపై చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యారు. దీని కారణంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో సరైన నిబంధనలు పాటించని కొందరు అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.
వైసీపీ కోసం పనిచేసిన చాలా మంది పోలీసు అధికారులు, ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెలుపల ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, లేకపోతే వారు టీడీపీ కొత్త ప్రభుత్వంలో చాలా కాన్సీక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ అధికారులు ఐపీఎస్ నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ఆదేశాలను పాటించారట. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నందున శిక్ష తప్పదని వారు భయపడుతున్నారు.
ఈ అధికారుల బదిలీ అభ్యర్థనలను తిరస్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. చేసిన తప్పులకు వారు తప్పనిసరిగా చర్యలను ఫేస్ చేయాల్సిందే అని లోకేష్ పట్టుబడుతున్నారట. ముఖ్యంగా జగన్ హయాంలో ప్రతిపక్ష సభ్యులపై వివాదాస్పద కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులను వైసీపీ ఓటమి నివ్వెరపరిచింది. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కొత్త ప్రభుత్వం ఆల్రెడీ హెచ్చరించింది.
 సీఐడీ నుంచి సంజయ్, సిట్ నుంచి కొల్లి రఘురామి రెడ్డి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరబ్ కుమార్ తదితరులపై టీడీపీ ముందుగా చర్యలు తీసుకోనుంది. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు బదిలీల నిర్వహణకు సంబంధించి అదనపు బాధ్యతలు అప్పగించారు. గత పాలకవర్గంతో సన్నిహితంగా పనిచేసిన అధికారుల జాబితాను కూడా తయారు చేశారు. ఇప్పుడు వారందరూ టిడిపి టార్గెట్ లిస్టులోకి చేరిపోయారు.
ఇటీవల జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ఐపీఎస్ అధికారి సంజయ్ సెలవును రద్దు చేసింది, రెవెన్యూ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజేశ్వర రెడ్డిని డిప్యూటేషన్ నుంచి రీకాల్ చేయడం జరిగింది. సీఎం కార్యాలయంతో సంబంధం ఉన్న రెప్పు ముత్యాలరాజు, పూనం మాలకొండయ్య, భరత్ గుప్తా వంటి కీలక అధికారుల బదిలీలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. గతంలో చేసిన పనులకు సమాధానం చెప్పాల్సిందిగా వీళ్లందరినీ ప్రభుత్వం త్వరలోనే ఒత్తిడి చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: