కాంగ్రెస్‌కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చంద్రబాబు..??

Suma Kallamadi
కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడును తమ వైపు తిప్పుకోవడానికి చాలానే ప్రయత్నించింది. ఈసారి ఎన్డీయే కూటమికి కేంద్రంలో 292 ఎంపీ సీట్లు వచ్చాయి. దాంతో పూర్తి మెజారిటీతో మళ్లీ ఎన్డీయే అధికారంలోకి రావడానికి సిద్ధమయ్యింది. ఇండియా కూటమి 233 సీట్లను కైవసం చేసుకుంది. ఇందులో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు గెలుచుకుంది. సమాజ్ వాదీ పార్టీకి 37 సీట్లు రాగా, తృణమూల్ కాంగ్రెస్ 29, డీఎంకే 22 సీట్లు గెలుచుకోగలిగాయి. అయితే ఎన్డీయేకి పోయినసారి ఎన్నికలతో పోలిస్తే 100 సీట్లు తగ్గాయి. ఫలితంగా స్వల్ప మెజారిటీతోనే అది అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ మాత్రం బాగా పుంజుకుంది. ఇంకొన్ని సీట్లు గెలుచుకుంటే ఇండియా కూటమి కచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఉండేది.
అయితే కాంగ్రెస్ చంద్రబాబు, జనసేన పార్టీలు గెలుచుకున్న ఎంపీ సీట్లు తమ వైపు తిప్పుకొని మెజార్టీ పెంచుకోవాలని చూస్తోంది. చంద్రబాబును చాలాసార్లు రెచ్చగొట్టింది కూడా. కానీ బాబు మాత్రం అటువైపు అడుగు వేయలేదు. బీజేపీకే తమ మద్దతు అని స్పష్టం చేస్తూ కాంగ్రెస్ కి పెద్ద జలక్ ఇచ్చారు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చినంత మాత్రాన అది అధికారంలోకి రాదు. పైగా బీజేపీతో స్నేహం పోతుంది. అప్పుడు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు కూడా రావు.
ప్రస్తుతం ఎన్డీయే తక్కువ మెజారిటీతో ఉంది కాబట్టి మోదీ చంద్రబాబు ఏది అడిగితే అది ఇచ్చే అవకాశం ఉంది. బాబు ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాన్ని అడగవచ్చు, లక్ష కోట్ల ప్యాకేజీ కూడా తీసుకోవచ్చు. ఇంకా అతనికి నచ్చిన పనులు ఎన్నో చేయించుకోవచ్చు. అందుకే బీజేపీని చంద్రబాబు వదలడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా కూడా చంద్రబాబును బుజ్జగించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. కానీ కాంగ్రెస్ లోకి వెళ్లడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదని చంద్రబాబు వెంటనే తెలుసుకోగలిగారు కాబట్టి ఆ పార్టీకి మద్దతు తెలిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: