ఎమ్మెల్యే పవన్ సినిమాలు కొనసాగిస్తారా? ఆపేస్తారా?

Purushottham Vinay
జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గెలుపు అనేది ఆయనకి ఇప్పుడు అత్యంత బరువైన బాధ్యత. ఐదు కోట్ల ఆంధ్రులకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ఆయనపై ఇంకా ఆయన పార్టీపై ఉంది. గెలిచింది 21 ఎమ్మెల్యేలు..2 ఎంపీలే అయినా కూటమి ఆధ్వర్యంలో ప్రజల కిచ్చిన ప్రతీ హామీని కూడా నెరవేర్చుతానని ప్రామిస్ చేసి మరి అధికారంలోకి వచ్చారు పవర్ స్టార్.అన్యాయాన్ని ఎల్లప్పుడూ ప్రశ్నించడం జనసేన నైజమని చెప్పిన పవన్ ఆ దిశగానూ అడుగులు వేస్తారని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో రాజకీయం..సినిమా అనే రెండు పడవల ప్రయాణానికి పీకే ఎంతవరకూ న్యాయం చేస్తారన్నది వేచి చూడాలి. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ కమిట్ అయిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. ముందుగా 'ఓజీ'..'హరి హర వీరమల్లు' చిత్రాల షూటింగ్ ని పూర్తి చేసి వాటిని రిలీజ్ చేయాలి. అవి రెండేసి భాగాలుగా రిలీజ్ కానున్నాయి. అందుకు తగ్గట్టు పక్కా ప్రణాళిక వేసుకుని వాటిని ప్రేక్షకాభిమానుల ముందుకు తీసుకురావాలి. మొదటి రెండు భాగాలు ఇదే సంవత్సరం రిలీజ్ అవుతాయని చిత్రవర్గాలు చెబుతున్నాయి.


మరి అది ఎంత దాకా సాధ్యమవుతుందో చూడాలి.ఇంకా అలాగే హరీష్ శంకర్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీని కూడా పూర్తి చేయాలి. ఇది వచ్చే ఏడాది విడుదల అవ్వడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి పీకే ముందు పూర్తి చేయాల్సిన మూవీస్ లిస్ట్ అది. ఓవైపు ఎమ్మెల్యేగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతూనే సినిమాలకు ఖచ్చితంగా సమయం కేటాయించాలి. అయితే ఈ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత పవన్ కొత్త సినిమాలకు డేట్లు ఇస్తారా? పూర్తి స్థాయిలో రాజకీయంలోనే కొనసాగుతారా? అన్న విషయం ఆసక్తికరంగా మారింది.తన పార్టీ అవసరాల కోసం సినిమాలు చేస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కానీ ఇప్పుడది సాధ్యపడుతుందా? లేదా? అన్నది చూడాలి. వచ్చే ఎన్నికల సమయానికి తన జనసేన పార్టీని బలోపేతం చేయాలి. ఇచ్చిన హామీలు తీర్చాలంటే పూర్తి స్థాయిలో ప్రజల్లోనే ఉండాలనే ఒత్తిడికి కూడా ఉంది.మరి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పవన్ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారా? లేక రెండు పడవల ప్రయాణాన్ని కొనసాగిస్తారా? అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: