రాజకీయ గెలుపుతో పాన్ ఇండియా స్టారయిన పవర్ స్టార్?

Purushottham Vinay
తెలుగు స్టార్ హీరో పిఠాపురం ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ ని ఒకప్పుడు ఆవేశపరుడుగా, నిలకడ లేని రాజకీయ నాయకుడిగా అభివర్ణించిన వారు ఇప్పుడు ఆయన రాజకీయ చతురత గురించి గొప్పగా చెబుతున్నారు. ఒంటరిగా వచ్చిన కూటమిగా వచ్చిన అంతిమంగా గెలవడం అనేది ముఖ్యం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో 100% సక్సెస్ అయ్యారు. అందుకే ఈ రోజు దేశం మొత్తం ఇటు నేషనల్ మీడియా అటు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గురించి విస్తృతమైన చర్చ నడుస్తుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయ రణక్షేత్రంలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన భూమిక పోషించారు. ఇక తాజాగా జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పక్షాల సమావేశంలో సాక్షాత్తు మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ని ప్రశంసించడం విశేషం. పవన్ కళ్యాణ్ ని అందరూ పవర్ స్టార్ అంటారు కానీ అతను తుఫాన్ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఆయన్ని అభివర్ణించడం విశేషం. దీనిని నేషనల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ కి స్పెషల్ ఫోకస్ వచ్చేలాగా కూడా చేస్తోంది.

దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కి లభించిన ఈ విశేషమైన గుర్తింపు ఆయన పాన్ ఇండియా సినిమాలకు కూడా ఖచ్చితంగా బాగా హెల్ప్ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ చేస్తున్నారు.ఇంకా అలాగే హరిహర వీరమల్లు మూవీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమాలకు కూడా పవన్ కళ్యాణ్ పొలిటికల్ చరిష్మా కలిసొస్తుందని భావిస్తున్నారు. బిజినెస్ పరంగా కూడా హెల్ప్ కావడంతో పాటు దేశ వ్యాప్తంగా వీటికి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించే అవకాశం ఖచ్చితంగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటికే నేషనల్ స్థాయిలో ఇన్ ఫ్లూయెన్సర్స్ కూడా పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టులు పెడుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ని తుఫాన్ అంటూ పోల్చడం పై రియాక్ట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ స్టామినా ఇంకా ఫ్యాన్ బేస్ ఏ స్థాయిలో ఉందో వీడియోల ద్వారా పరిచయం చేస్తున్నారు. ఒక విదంగా ఇది రియల్ పాన్ ఇండియా క్రేజ్ అనేలా కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆయన మూవీ కెరియర్ పాన్ ఇండియా లెవెల్ కి తీసుకువెళ్ళదానికి కచ్చితంగా హెల్ప్ అవుతాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: