ఐ ప్యాక్‌ : జగన్‌ పై కొట్టు సత్యనారాయణ తిరుగుబాటు ?

Veldandi Saikiran
ఐ ప్యాక్‌ : జగన్‌ పై కొట్టు సత్యనారాయణ తిరుగుబాటు ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ అత్యంత దారుణంగా ఓటమిపాలైంది. ఎవరు ఊహించని.. స్థాయిలో ఓడిపోయింది వైసీపీ పార్టీ. ఒకవేళ ఓడిపోయిన కూడా...  2014 ఎన్నికల్లో వచ్చిన సీట్లు వైసిపి పార్టీ సొంతం చేసుకుంటుందని అందరూ అంచనా వేశారు. కానీ ఆ అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. ప్రతిపక్ష హోదా కూడా ఏపీలో దక్కకుండా చేసింది తెలుగుదేశం కూటమి. మొన్నటి ఎన్నికల్లో కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీకి 11 సీట్లు రావడం ఎవరు ఊహించనిది.

అసలు ఈ ఓటమిపై ఏం మాట్లాడాలి అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ ఓటమి అనంతరం అసలు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా వైసిపి నేతలు ముందు రావడం లేదు. ఎందుకు ఓడిపోయాము అనే విషయాన్ని కూడా ఏ నాయకులు చెప్పలేకపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. కొంతమంది మాజీ మంత్రులు.... జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను ఎత్తి చూపిస్తున్నారు. మొన్నటికి మొన్న... జక్కంపూడి రాజా... జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను ఎత్తి చూపారు.

జగన్మోహన్ రెడ్డి కొంతమంది అధికారులు గుడ్డిగా నమ్మాడని.. అందుకే వైసిపి ఓడిపోయిందని అతను చెప్పారు. ధనుంజయ రెడ్డి లాంటి అధికారుల వల్ల..  వైసిపికి ఈ పరిస్థితి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక గుడివాడ అమర్నాథ్ కూడా... వాలంటీర్ వ్యవస్థ దారుణంగా విఫలమవడంతో...  ఈ ఓటమి  ఎదురైందని తెలిపారు. అయితే తాజాగా.. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా ఎత్తిచూపారు. కొంతమంది అధికారులను గుడ్డిగా నమ్మడం వల్ల వైసీపీ ఓడిపోయిందని తెలిపారు కొట్టు సత్యనారాయణ. తాజాగా వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో కొట్టు సత్యనారాయణ మాట్లాడారు.

ఐప్యాక్ సంస్థ, వాలంటీర్ వ్యవస్థ వల్ల వైసీపీ ఓడిపోయిందని కుండబద్దలు కొట్టి చెప్పారు కొట్టు సత్యనారాయణ. ఆఫీసులో కూర్చుని.. ఏపీ రాజకీయాలను ఐపాక్ సంస్థ... శాసించే ప్రయత్నం చేసిందని... అసలు గ్రౌండ్ రిపోర్ట్.. వాళ్లకి ఏమీ తెలియదని ఆయన తెలిపారు. ఐ ప్యాక్ సంస్థ ఒక పనికిమాలిన సంస్థ అంటూ వ్యాఖ్యానించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి....  వైఖరి కారణంగా కూడా వైసిపి ఓడిపోయిందని కొట్టు సత్యనారాయణ తెలిపారు. దీంతో... జగన్మోహన్ రెడ్డి పై కొట్టు సత్యనారాయణ తిరుగుబాటు చేసేందుకు సిద్ధమైనట్లు టిడిపి సోషల్ మీడియాలో వార్తలు రాస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: