
కేసీఆర్ లాగే.. జగన్ ఫోన్ ట్యాపింగ్ చేసారా.. లోకేష్ సంచలన ఆరోపణ?
ఇకపోతే ఈనెల 12వ తేదీన అటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదే సమయంలో కూటమిలో ఉన్న జనసేన, బిజెపి నుండి గెలిచిన అభ్యర్థులకు కూడా కీలకమైన పదవులు అప్పగించేందుకు ఇప్పటికే అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నేతలందరూ కూడా వైసిపి ప్రభుత్వం గతంలో చేసిన దురాగతాలపై నోరు విప్పి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల టిడిపి జాతీయ కార్యదర్శి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ చేసిన కామెంట్స్ కాస్త సంచలనంగా మారిపోయాయి.
వైసిపి ప్రభుత్వం తన ఫోన్లను ట్యాప్ చేసింది అంటూ ఆరోపించారు నారా లోకేష్. ఆపై ఆధారాలను కూడా ధ్వంసం చేసింది అంటూ తెలిపారు. దీనిపై నాకు స్పష్టమైన సమాచారం అందింది. మా ఫోన్లు టాప్ అయిన విషయం మాకు కూడా తెలుసు. అయితే నా ఫోన్ పై పెగాసిస్ దాడి జరిగినట్లు నేను గతంలో కూడా చెప్పాను. రెండుసార్లు పెగసిస్ దాడి జరిగింది అనడానికి నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. చివరిగా ఏప్రిల్ లో ఇలాంటి ఎటాక్ జరిగింది అంటూ నారా లోకేష్ ఆరోపించారు అయితే ఆయన చేసిన ఆరోపణలు సంచలనంగా మారిపోయాయి. కాగా తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ కూడా ఇలా అధికారులు, ప్రతిపక్ష నేతల ఫోన్ టాపింగ్ కేసులో ఇరుక్కున్నారు. ఈ కేసు కారణంగానే ఒక రకంగా అధికారాన్ని కోల్పోయారు అని చెప్పాలి.