ఉద్యోగులకు రామోజీ క్రమశిక్షణ పాఠాలు.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!
కేవలం లే అవుట్ ఆర్టిస్టుగా విధుల్లో చేరిన శ్రీధర్, సబ్ ఎడిటర్‌గా.. విధులు చేపట్టిన మానుగుంట నాగేశ్వరరావు, దగ్గుబాటి నిత్యానంద ప్రసాద్.. వంటివారు.. తర్వాత.. కాలంలో సంస్థలో కీలక పదవులకు చేరారు. ఇది వార స్వయం కృషి మాత్రమే కాదు.. అడుగడుగునా... రామోజీరావు.. ప్రోత్సహించిన తీరు... వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసిన తీరుకు నిదర్శనం. ఈనాడును మూడు దశాబ్దాల పాటు ఆకర్షిణీయంగా మలిచింది.. కార్టూన్లు. అందునా శ్రీధర్ కార్టూన్లు. ఇలా.. శ్రీధర్ లో నైపుణ్యాన్ని వెలికి తీసిన ఘనత రామోజీరావుదే.
ఇప్పుడు ఏపీ ఈనాడు సంస్థల కు ఎడిటర్‌గా ఎదిగిన నాగేశ్వరరావు.. ఎం.ఎన్.ఆర్ కూడా.. సబ్ ఎడిటర్‌గా విధుల్లో చేరారు. కానీ, ఆయన విధేయత.. సమయ పాలన , నైపుణ్యాలు పసిగట్టిన రామోజీరావు.. తర్వాత.. కాలంలో సంస్థలో భాగస్వామిని చేశారు. ఇక, డీఎన్..గా సంస్థకు తెలిసిన.. దగ్గుబాటి నిత్యానంద ప్రసాద్ ప్రసాద్ కూడా.. ఇలానే సంస్థలోకి వచ్చారు. రామోజీ చెప్పేది ఒక్కటే.. మీరు ఏ సంస్థలో అయితే.. పనిచేస్తున్నారో.. ఆ సంస్తకే అంకితం కావాలని. ఆ సంస్థకు మనసా వాచా కర్మణ పనిచేయాలని.
ఇలా పనిచేసిన ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లారు. లేని వారు అక్కడే ఆగిపోయారు. కేవలం ఉద్యోగుల పనితీరుపైనే అంతర్గత పత్రిక దివిటీ ని నడిపించిన ఏకైక పత్రిక కూడా.. ఈనాడే.. ఉద్యోగుల తప్పులే కాదు.. ప్రతిభ ఉన్న వారి ప్రమాణాలను కూడా.. దీని ద్వారా.. సంస్థలో కొనియాడేవారు. సమయ పాలనకు పెద్దపీట వేశారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాల విషయంలోనూ ఈనాడుదే పైచేయి. తద్వారా.. ఈనాడు.. ఒక ఆదర్శ ఉద్యోగ పత్రికగా.. సగర్వంగా నిలబడింది.