బాబు, పవన్: రాష్ట్రాన్ని ముంచుతారా? కాపాడతారా?

Purushottham Vinay
•ఇక నుంచి బాబుకి, కళ్యాణ్ కి పెద్ద పరీక్ష


•గెలుపుని 10,15 ఏళ్ళు నిలబెట్టుకోవాలంటే కష్టపడాల్సిందే

 
•ప్రజాసేవ చేయకుంటే వైసీపీలా కూటమి నాశనమవ్వడం ఖాయం

అమరావతి - ఇండియా హెరాల్డ్ : టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ మెజారిటీతో గెలిచి వైసీపీని చిత్తుగా ఓడించింది.రాజకీయాలలో ఓర్పు అనేది చాలా ముఖ్యమని కూటమి నిరూపించారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారని ప్రకటించగానే ఖచ్చితంగా గెలుపు ఖాయమంటూ టీడీపీ, జనసేన ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. పవన్ ని, బాబుని చాలా దారుణాతి దారుణంగా అవమానించిన వైసీపీ అంతే దారుణంగా వారి చేతిలో ఓడిపోయింది. ఎన్నికల ముందు ఊహించిన దాని కంటే ఎక్కువ మెజారిటీతో టీడీపీ కూటమి గెలిచింది. ఏదీ ఏమైనా అన్ని అడ్డంకులు దాటుకొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత రికార్డు స్థాయిలో విజయం సాధించారు.అయితే గెలుపు ముఖ్యం కాదు. ప్రజా సేవే ముఖ్యం. ప్రజలకు మేలు చేయకపోతే ఎంత పెద్ద నాయకుడైన ప్రజల తీర్పుతో ఓడిపోవాల్సిందే. 2019 లో ఇంతకంటే భారీ మెజారిటితో జగన్ గెలిచాడు. కానీ గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యలేదు. ప్రజలకు మేలు చేయలేదు. అందువల్ల చాలా దారుణంగా ఓడిపోయాడు. ఈసారి జనాలు చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇచ్చి వారిని భారీ మెజారిటీతో గెలిపించారు. ఈ క్రమంలో వారు నిజమైన రాజకీయ నాయకులు అనిపించుకోని మళ్ళీ గెలిచి అధికారంలోకి ఖచ్చితంగా ప్రజలకి మేలు చెయ్యాలిసిన అవసరం ఉంది.

ఎందుకంటే మాజీ జగన్ మోహన్ రెడ్డి కూడా గతంలో జనాల్లో మంచి క్రేజ్ సంపాదించుకొని భారీ విజయంతో సీఎం అయ్యారు. కానీ ఆ ప్రేమని జగన్ ఏమాత్రం నిలబెట్టుకోలేకపోయారు. అలాగే పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా ఇక నుంచి 5 ఏళ్ల పాటు జనాలకి మేలు చేసి ప్రేమని పెంచుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలని తీర్చాలి. గత పదేళ్ల నుంచి ఇంత వరకు ఆంధ్రప్రదేశ్ లో ఒక్క పెద్ద ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదు. దానిపై పవన్, చంద్రబాబు దృష్టి పెట్టాలి.పవన్ కళ్యాణ్, చంద్రబాబు గెలుపుకి ప్రధాన కారణం యూత్. ఎందుకంటే వారికి ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాలు కావాలంటే హైదరాబాద్ లాంటి రాజధాని కావాలి. కాబట్టి ఖచ్చితంగా యూత్ కోసం పవన్ కళ్యాణ్, చంద్రబాబు రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, రాజధానిని నిర్మించి అనేక కంపెనీల నిర్మాణానికి కృషి చెయ్యాలి. నిరుద్యోగులు కోసం ఈ 5 ఏళ్ళు వారు చాలా కష్టపడాలి.అంతేకాదు జనాలకు తాము ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా నెరవేర్చాలి. ఎప్పటి నుంచో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ సమస్యని తీర్చేందుకు ఖచ్చితంగా కృషి చెయ్యాలి. ముఖ్యంగా పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతాన్ని కూడా బాగా అభివృద్ధి చెయ్యాలి.

ఎందుకంటే ఆ ప్రాంతంలో పేద వాళ్ళు చాలా ఎక్కువ. మురికివాడలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గెలుపు కోసం ఎంత కష్టపడ్డారో జనాలకి మంచి చెయ్యడానికి కూడా ఆ విధంగానే కష్టపడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం వారి మేలు కోసం టీడీపీ కూటమి ఖచ్చితంగా కేంద్రాన్ని కూడా ప్రశ్నించాలి. ఎలాగో కూటమిలో కేంద్ర అధికారిక పార్టీ భాగమై ఉంది కాబట్టి పైగా ఇప్పుడు కూటమి చేతిలోకి అధికారం వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ వచ్చేదాకా అలుపెరగని పోరాటం చెయ్యాలి. ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ అనేది చాలా ముఖ్యం. దాని కోసం ఖచ్చితంగా కృషి చెయ్యాలి.ఇలా ఇవన్నీ చేస్తేనే టీడీపీ కూటమి మళ్ళీ 10,15 సంవత్సరాల పాటు ఖచ్చితంగా అధికారం వస్తుంది.లేదంటే మరో జగన్ మోహన్ రెడ్డి లాగా బాబు, పవన్ అవుతారు. మరి చూడాలి పవన్ కళ్యాణ్, చంద్రబాబు రాబోయే ఈ 5 ఏళ్లలో జనాలకి ఎలాంటి మేలు చేస్తారనేది..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: