సాధారణ రామయ్య ప్రఖ్యాత రామోజీరావు ఎలా అయ్యాడు?

Purushottham Vinay
రామోజీరావు అంటే తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని మనిషి. ఈనాడు గ్రూప్స్ ఛైర్మన్ గా, వ్యాపార దిగ్గజంగా రామోజీరావు అంటే తెలియని వారు ఉండరు.కొంతమందికి సినీ నిర్మాతగా తెలుసు. ఇలా మనందరికి కూడా రామోజీ రావుగానే ఆయన పరిచయం... కానీ ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు మాత్రం ఇది కాదట..!! తన పేరును రామోజీ రావుగా ఆయనే స్వయంగా మార్చుకోవడం జరిగింది. ఇక ఆ పేరే ఇప్పుడు ఓ బ్రాండ్ గా మారిపోయింది. కృష్ణా జిల్లాలోని పెదపారుపూడిలో నవంబర్ 16, 1936 లో వెంకటసుబ్బారావు, వెంకటసుబ్బమ్మ దంపతులను మగబిడ్డ పుట్టాడు. దీంతో తన తండ్రే మళ్ళీ కొడుకుగా పుట్టాడని సుబ్బారావు ఎంతో సంబరపడిపోయాడు... అందువల్లే తన కొడుకుకు తండ్రి రామయ్య అని పేరుపెట్టుకున్నాడు. ఆ రామయ్యే ఇప్పుడు మనందరికి సుపరిచతమైన రామోజీరావుగా ఎదిగాడు. అయితే స్కూల్ డేస్ లో ఎందుకో మరి రామయ్య అన్న పేరును మార్చుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఎంతో ఆలోచించి చివరకు రామయ్య పేరును 'రామోజీరావు' గా మార్చుకోవడం జరిగింది. ఆ తర్వాత రామోజీరావుగానే ఆయన ప్రపంచానికి పరిచయం అయ్యారు.


రామోజీరావు పూర్వీకుల విషయానికి వస్తే.. వారిది పామర్రు మండలం పెరిశేపల్లి గ్రామం. అక్కడి నుండి ఆయన తాత రామయ్య పెదపారు పూడికి వలస వెళ్లారు. రామోజీ రావు కూడా అక్కడే జన్మించారు. అతడికి రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ అనే వారు తోబుట్టువులు. ఒక్కడే మగపిల్లాడు కావడంతో తల్లిదండ్రులు సుబ్బారావు, వెంకటసుబ్బమ్మ రామోజీరావును ఎంతో అల్లారుముద్దుగా చూసుకునేవారు. రామోజీ రావు ప్రాథమిక విద్యాభ్యాసం కూడా స్వస్థలంలోనే ముగిసింది... ఉన్నత విద్యాభ్యాసం వచ్చేసి గుడివాడలో సాగింది. రామోజీరావు బిఎస్సి చదివారు.ఇక చదువు పూర్తయ్యాక డిల్లీలో మూడేళ్ళపాటు అడ్వర్టైజింగ్ ఏజన్సీలో పనిచేసారు. అదే ఆయన జీవితాన్ని ఓ రేంజ్ లో మలుపు తిప్పింది. ఉద్యోగం చేస్తుండగానే రామోజీరావుకు పెనమలూరుకు చెందిన రమాదేవితో పెళ్లి అయ్యింది. పెళ్లి తర్వాతే డిల్లీ నుండి హైదరాబాద్ కు వచ్చారు రామోజీరావు. ఇక ఉద్యోగం కాకుండా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్న ఆయన మొదట మర్గదర్శి చిట్ ఫండ్ ని ప్రారంభించారు. ఆ అంచెలంచెలుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ మీడియా రంగంలో మకుటం లేని రాజుగా దూసుకుపోయి ఇప్పుడు మహారాజుగా కన్నుమూసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: