పెద్దిరెడ్డికి చావు తప్పి కన్ను లొట్ట పోయిందే?

Suma Kallamadi
వైసీపీలో అత్యంత కీలకమైన నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. వైసీపీలో జగన్ తర్వాత ఎక్కువ ప్రాధాన్యత విలువ ఉన్న నేత పెద్దిరెడ్డి. 2019 నుంచి 2024 వరకు కేబినెట్‌లో స్థానం కల్పించిన అతికొద్ది మంది వైసీపీ నాయకులలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు. 2019లో చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గానూ వైసీపీ 13 సీట్లు గెలుచుకోవడంలో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించారు. పెద్దిరెడ్డికి చిత్తూరు జిల్లాలో మంచి పట్టు ఉంది.
ఇక టీడీపీకి కంచుకోట అయిన కుప్పంలో స్థానిక ఎన్నికల్లో కూడా ఇన్‌ఫ్లూయెన్స్, డబ్బు ఉపయోగించి గెలిచారు. ప్రస్తుత ఎన్నికలకు ముందు కుప్పంలో వరుసగా ఏడుసార్లు గెలిచిన చంద్రబాబుకు సవాల్ విసిరారు. కానీ బాబు కుప్పంలో 48,006 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు, ఇది 2019లో తన మెజారిటీ కంటే 18,000 ఎక్కువ. చంద్రబాబును ఓడించడం మాట దేవుడు ఎరుగు కానీ పెద్దిరెడ్డి ఈసారి గెలవడానికి చాలా కష్టపడ్డారు.
ఈ ఎన్నికల్లో పెద్దిరెడ్డి చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ గెలిచిన 11మంది ఎమ్మెల్యేలలో ఆయన కూడా ఒకరు కాగలిగారు. ఆయన పుంగనూరు నుంచి పోటీ చేయగా, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు. వీరిద్దరూ కూడా స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. టీడీపీకి చెందిన చల్లా రామచంద్రారెడ్డికి గట్టి పోటీ ఇవ్వగా, పెద్దిరెడ్డి కేవలం 6,619 ఓట్ల మెజారిటీతో తృటిలో పరాజయాన్ని తప్పించుకున్నారు.
మిథున్ రెడ్డి కూడా జస్ట్ 76,071 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ప్రాంతంలో టీడీపీ పోటీ చేసి ఉంటే ఆయన ఓడిపోయేవారు. అయితే మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ నుంచి టికెట్ దక్కింది.  రాజంపేట పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలు టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసినప్పటికీ లోక్‌సభకు మిథున్‌రెడ్డిని ఎంపిక చేసుకున్నారు. దీనివల్ల క్రాస్ ఓటింగ్ భారీ ఎత్తున జరిగింది. మొత్తం మీద పెద్దిరెడ్డి కుప్పంలో చంద్రబాబును ఓడిస్తానని ఛాలెంజింగ్ చేశారు. కానీ ఆయన గెలవడమే కష్టం అయిపోయింది. చివరికి అతని పరిస్థితి ప్రస్తుతం “చావు తప్పి కన్ను లొట్టబోయింది”. అన్న చందాన మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: