ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందంటారా?

Purushottham Vinay
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మెజారిటీ అనేది వచ్చింది. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడవ సారి ప్రధాన మంత్రి గా నరేంద్ర మోదీ గారు జూన్ 9 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.బీజేపీ, ఎన్డీయేలోని భాగస్వామ్య పార్టీల ఎంపీలు ఆయనను లోక్‌సభలో తమ నాయకుడిగా ఎన్నుకోవడం జరిగింది. దీని కంటే ముందు కూడా ఎన్డీయేలోని భాగస్వామ్య పార్టీలు తమ డిమాండ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందు ఉంచడం జరిగింది. ఎన్డీయేలోని రెండు ప్రధాన పార్టీలు కూడా తమ తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలనే నినాదాన్ని తెరపైకి తీసుకు రావడం జరిగింది. బీహార్‌ రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని రాష్ట్ర మంత్రి.. బీహార్ ముఖ్యమంత్రి అయిన నితీశ్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడు, జేడీయూ నేత విజయ్ చౌదరి డిమాండ్ చేయడం జరిగింది. ఇంకా అలాగే అదే సమయంలో తెలుగు దేశం పార్టీ యొక్క అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడు కూడా చాలా కాలం నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కోసం ఇదే డిమాండ్ చేస్తున్నారు. అయితే గతంలో జరిగిన కొన్ని రాజకీయ సమీకరణాల దృష్ట్యా, కేంద్రంలో తమకు సరిపడా బలంలేని నేపథ్యంలో ప్రత్యేకహోదా అంశాన్ని చాలా మంది నేతలు పక్కన పెట్టేయడం జరిగింది.


అయితే తాజాగా వచ్చిన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టాలంటే ఆంధ్ర ప్రదేశ్ నుంచి  పార్లమెంటుకు ఎంపికైన అభ్యర్థుల మద్దతు ఖచ్చితంగా తప్పనిసరిగా ఉండాలి. దీంతో ప్రత్యేక హోదా అంశం అనేది మరోసారి తెరపైకి వచ్చింది.రాష్ట్రాలకు ప్రత్యేక హోదాని ఇవ్వడం వల్ల స్థానిక ప్రజల హక్కులనేవి రక్షించబడతాయి. ప్రత్యేక రాష్ట్ర హోదా పొందినప్పుడు, రాష్ట్రానికి ప్రత్యేక మినహాయింపులు ఇంకా అలాగే ప్రత్యేక గ్రాంట్లు లభిస్తాయి. ఇప్పటిదాకా దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వచ్చింది. ఉత్తరఖండ్, సిక్కిం, మీజోరం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్ తో తెలుగు రాష్ట్రం తెలంగాణ కూడా పొందింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆంధ్రులు ప్రత్యేక హోదా ఆశిస్తున్నారు. కూటమిలో బీజేపీ కలవడం వల్ల టీడీపీ అధినేత చంద్రబాబు పైనే ప్రజలు ఆశలు పెట్టుకుంటున్నారు.ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉంది. మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: